జగన్ పవన్ చంద్రబాబు : ఈ రోజు వీరి షెడ్యూల్ ఇదే 

ఏపీలో రాజకీయ ప్రచార యాత్రలు కొనసాగుతూనే ఉన్నాయి.

ఒకపక్క వైసీపీ అధినేత , ఏపీ సీఎం జగన్( AP CM Jagan ) మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు.

నిన్ననే పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో జగన్ యాత్ర కొనసాగింది.షెడ్యూల్ ప్రకారం నిన్న రాత్రికి రావులపాలెం మండలం ఈతకోటకు చేరుకుని అక్కడ రాత్రి బస చేయాల్సి ఉంది.

కానీ ఈరోజు ( బుధవారం ) శ్రీరామనవమి పర్వదినం( Sri Ramanavami festival ) సందర్భంగా బస్సు యాత్రకు జగన్ విరామం ఇచ్చారు.నిన్న రాత్రి తణుకు సమీపంలోని తేతలి లో జగన్ బస్ చేశారు .గురువారం తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారానికి వెళ్తారు.

రావులపాలెం,  కడియం( Ravulapalem, Kadiam ) మీదగా గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు వేమగిరికి జగన్ చేరుకుంటారు.అక్కడ భోజనం విరామం అనంతరం పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడి అనంతరం 3.30 గంటల నుంచి రోడ్ షో కొనసాగిస్తారు.  వేమగిరి మీదుగా బొమ్మూరు జంక్షన్,  కుకుంపేట జంక్షన్, మోరంపూడి జంక్షన్,  ఎంపీ కార్యాలయం ,ఆర్టిసి కాంప్లెక్స్, తాడితోట జంక్షన్ , అశోక థియేటర్ , ఆజాద్ చౌక్ , గాంధీ బొమ్మ సెంటర్,  దేవి చౌక్,  గోకవరం బస్టాండ్,  ఆర్యాపురం , అకిరా జంక్షన్,  మూలగొయ్యి , సీతంపేట , పేపర్ మిల్లు,  మల్లయ్య పేట గ్రామం బ్రిడ్జి మీదుగా దివాన్ చెరువు వరకు రోడ్ షో కొనసాగిస్తారు.

Advertisement

పవన్ కళ్యాణ్ చంద్రబాబు 

టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu ) జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నేడు ఉమ్మడి ప్రచారంలో పాల్గొనబోతున్నారు ఈరోజు ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఈ ఇద్దరు నాయక పర్యటన కొనసాగుతుంది .ప్రజాగళం సభల్లో ఇద్దరు పాల్గొనబోతున్నారు ఇద్దరూ కలిసి ఇప్పటికే ఉభయగోదావరి జిల్లాలో జరిగిన ప్రజాగణం సభల్లో పాల్గొంటూ వస్తున్నారు.నేడు మచిలీపట్నం , పెడన నియోజకవర్గంలో ఇద్దరు పర్యటిస్తారు.

అలాగే ఇద్దరు కలిసి బహిరంగ సభల్లో ప్రసంగించబోతున్నారు.దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు టిడిపి , జనసేనలు పూర్తి చేశాయి.

ఈ సభలో బిజెపి నేతలు పాల్గొనబోతున్నారు .

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?
Advertisement

తాజా వార్తలు