పందులు బురదలో దొర్లడం వెనుక గల కారణం ఇదే... తెలిస్తే మీరు కూడా దొర్లుతారు!

పందులు గురించి అందరికీ తెలిసిందే.ఇవి బేసిగ్గా మట్టి లేదా కాలువలో లేదా బురదలో ఎక్కువగా మనకు కన్పిస్తుంటాయి.

అయితే మీరు ఎపుడైనా ఈ పందులు అలా బురదలో ఎందుకు తిరుగుతాయి అని ఎపుడైనా ఆలోచించారా? దీని వెనుక పెద్ద శాస్త్రీయ కారణం ఉందని చెబుతున్నారు కొందరు.బేసిగ్గా పందులకు చెమట గ్రంథులు ఉండవట.

కాబట్టి అవి చెమట పట్టవు.అందుకని అవి తమను తాము చల్లబరచడానికి బురదలో మునిగిపోతాయట.

అంతేకాకుండా బురద వలన వాటికి చాలా ఉపశమనం కలుగుతుందట.సాధారణంగా పందుల్ని చాలామంది అపరిశుభ్రమైన జంతువులలో ఒకటిగా పేర్కొంటారు.

Advertisement
This Is The Reason Behind Pigs Rolling In Mud , Pigs, Mud, Viral Latest, News Vi

కానీ అది నిజం కాదు.ఒక నివేదిక ప్రకారం, పందులు నిజానికి శుభ్రమైన జంతువులు అని తేలింది.

అవి నిద్రించే చోట మలవిసర్జన చేయడానికి కూడా నిరాకరిస్తాయి.నవజాత పందులు కూడా తమ నిద్ర స్థలాలను విశ్రాంతి కోసం వదిలివేస్తాయి.

పందులకు ఎక్కువ స్వేద గ్రంధులు ఉండవు, అందుకే పందులకు చెమట పట్టదు.కాబట్టి అవి బురదలో నిద్రపోతాయి మరియు చల్లగా ఉండటానికి నీటిలో ఈదుతాయి.

This Is The Reason Behind Pigs Rolling In Mud , Pigs, Mud, Viral Latest, News Vi

బురదలో జీవించడం వలన బోనస్ ఏమిటంటే ఇది పంది చర్మాన్ని వడదెబ్బ నుండి రక్షించడంలో కూడా సహాయపడుతుంది.పంది కుక్క కంటే తెలివైన జంతువు.పందులు మానవ బిడ్డ యొక్క మేధస్సును కలిగి ఉంటాయి.

Aloe vera : వాస్తు ప్రకారం కలబంద ఈ దిశలో నాటారంటే.. ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది..!

అంతేకాకుండా ప్రపంచంలోని ఐదవ అత్యంత తెలివైన జంతువుగా పందికి ర్యాంక్ వుంది.నిజానికి, పందులు కుక్క జాతి కంటే తెలివైనవి అని ఈ సర్వేలో తేలింది.

Advertisement

కేవలం 2 వారాల్లోనే పందుల్ని మచ్చిక చేసుకోవచ్చట.ఇంకో కొత్త విషయం ఏమంటే, ఆడ పంది పిల్లలకి హమ్ చేస్తుంది.

పందుల గురించి అత్యంత ఆసక్తికరమైన విషయాలలో ఇది ఒకటి.ఆడ పందులు తమ పిల్లలకు ఆహారం ఇస్తూ పాడతాయి.

తాజా వార్తలు