బీసీ కుల గణన వెనుక అసలు వ్యూహం ఇదా ? 

వచ్చే ఎన్నికల్లో తిరుగులేకుండా మళ్ళీ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కాంగ్రెస్(congress) అనేక వ్యూహాలు రచిస్తోంది.

దీనిలో భాగంగానే బీసీ ఓటు (BC vote)బ్యాంక్ ను పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది.

దీనిలో భాగంగానే తెలంగాణలో బీసీ కుల గణన కు శ్రీకారం చుట్టింది.తెలంగాణలో 50% బీసీ జనాభా ఉండడంతో మైనార్టీ వర్గమైన బీసీలను పూర్తిస్థాయిలో కాంగ్రెస్ వైపు మళ్ళించే విధంగా ఆ పార్టీ వ్యవహరచన చేస్తుంది.

ఈ మేరకు బీసీ కులగణన కు శ్రీకారం చుట్టింది.మొదటి నుంచి బీసీల్లో కాంగ్రెస్ కు ఆదరణ తక్కువ అని ఆ పార్టీ గుర్తించింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో టిడిపి వైపు బీసీలు మొగ్గు చూపినా,  తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ కి ఎక్కువగా వారు మద్దతిస్తుండడం , గత పదిహేళ్లుగా రకరకాల సంక్షేమ పథకాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీ ఓటు బ్యాంకును పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకోవడంతో,  ఇప్పుడు ఆ బీసీలను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ వ్యవహారచన చేస్తోంది.బీసీ జనగణన పేరుతో రాజకీయంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు లబ్ధి చేకూరుతుందని కాంగ్రెస్ చెబుతోంది.

Advertisement

ఇదే అంశాన్ని గత ఎన్నికల్లోను రాహుల్ గాంధీ పదే పదే ప్రచారం చేశారు.జనాభా ఎక్కువ శాతం ఉన్న బీసీలకు ఆ స్థాయిలో లబ్ధి చేకూరేలా చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఈ మేరకు తెలంగాణలో బీసీ గర్జన(Bc caste) చేపట్టేందుకు రేవంత్ రెడ్డి(revanth Reddy) ప్రభుత్వం సిద్ధమైంది.నవంబర్ 6 నుంచి కుల గణన ప్రారంభం కాబోతోంది.ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తమ ప్రభుత్వం చేస్తుందనే అంశాన్ని బీసీల్లోకి తీసుకువెళ్లే విధంగా కాంగ్రెస్ వ్యూహం రచిస్తోంది.  జనగణన ద్వారా బీసీలకు జరిగే లబ్ధిని ప్రతి గ్రామంలోనూ తెలియజేసే విధంగా కాంగ్రెస్ ప్లాన్ చేసుకుంటోంది.

గ్రామ కమిటీల ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పార్టీ నాయకులకు హై కమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయి.బీసీల్లో మెజారిటీ జనాలను తమ వైపు తిప్పుకుంటే వచ్చే ఎన్నికల్లో అధికారానికి ఇబ్బంది ఉండదని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.

ఏఎన్నార్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను షూట్ మధ్యలోనే ఆపాలనుకున్నారా.. ఏమైందంటే?
తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ 

దీనికోసమే బీసీల్లో ఆయా కుల సంఘాల నాయకులను రంగంలోకి దించే ఆలోచనతో ఉంది.

Advertisement

కులాల వారీగా సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న బీసీ గణన  ద్వారా బీసీలకు జరిగే మేలును వివరించే విధంగా ప్రణాళికను రచిస్తోంది.దీనికోసం పార్టీలో ఉన్న బిసి కీలక నేతలంతా కొద్దిరోజుల క్రితమే కీలక సమావేశాన్ని నిర్వహించుకున్నట్లు సమాచారం. బీసీ కుల గణన( BC caste census) పై ప్రభుత్వం కూడా త్వరలోనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసే ఆలోచనతో ఉంది.

మొత్తం బీసీల్లో 60% ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు మళ్ళించగలిగితే మరోసారి తమకు అధికారం దక్కడం ఖాయమని ఆ పార్టీ అంచనా వేస్తోంది .ముఖ్యంగా తెలంగాణ బీసీల్లో కీలకంగా ఉన్న యాదవ , గౌడ, ముదిరాజ్, పద్మశాలి (Yadava, Gowda, Mudiraj, Padmasali)వంటి కులాలను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసుకుంటుంది.నవంబర్ 6న మొదలయ్యే బీసీ కుల గణన నవంబర్ 31 లోగా పూర్తిచేసే విధంగా షెడ్యూల్ రూపొందించారు.

తాజా వార్తలు