పండరీపురానికి ఆ పేరు రావడానికి అసలు కారణం ఇదే..!

మహారాష్ట్రలోని పండరిపురానికి( Pandaripuram in Maharashtra ) ఒక ప్రాముఖ్యత ఉంది.ఇది దేవుడి పేరు తో ప్రసిద్ధి చెందిన క్షేత్రం కాదు.

భక్తుడి పేరుతో ప్రాచుర్యం చెందిన ప్రాంతం.దేవి దేవతల పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రాంతాలకి భిన్నమైన ఊరు పండరీపుర క్షేత్రం.

భక్తుడి కోరిక మేరకు మండు టెండలో సుదీర్ఘ కాలం నిలబడి తను భక్తికి కట్టుబడి ఉన్నానని ఆ దేవుడే నిరూపించిన ప్రాంతం కూడా ఇదే.శ్రీకృష్ణుడి( Lord Krishna ) మీద అలిగి వచ్చి రుక్మిణిదేవి( Rukmini Devi ) తప్పస్సు చేసిన ప్రాంతం కూడా పండరీపురమే అని పెద్దవారు చెబుతూ ఉంటారు.శ్రీకృష్ణ భక్తులకి అత్యంత ప్రీతిపాత్రమైన క్షేత్రాలలో ఇది ఒకటి.

శివుడు, కేశవుడు( Shivudu , Keshavudu ) ఇద్దరు ఒక్కటే అని నిరూపించిన ప్రాంతాల్లో పండరీపురం నిలుస్తుంది.పండరీపురం ఆధ్యాత్మికంగానే, పర్యాటకంగానూ యాత్రికులను ఆకర్షించే ప్రాంతం అని కచ్చితంగా చెప్పవచ్చు.

Advertisement
This Is The Real Reason Why Pandaripuram Got That Name , Pandaripuram, Maharash

ఆదిశంకరాచార్యుల వారు పాండురంగ అష్టకాన్ని ఇక్కడే రచించారు.అభిషేకం చేసే సమయంలో పాండరంగడ్ని దర్శించుకుంటే కొన్ని విషయాలను గుర్తించవచ్చు.

పాండురంగడి తల లింగాకారంలో ఉంటుంది.మహారాష్ట్రలో పాండరంగడ్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు.

This Is The Real Reason Why Pandaripuram Got That Name , Pandaripuram, Maharash

ఇలాంటి ప్రాంతాలలో పండరీపురం కూడా ఒకటి.పూర్వం రోజులలో ఈ ప్రాంతంలో విష్ణు భక్తులైన ఇద్దరు దంపతులు ఉండేవారు.వారి కుమారుడు పండరీకుడు చిన్నప్పటినుంచి చెడు అలవాట్లకు భానిసై బాధ్యత లేకుండా తిరుగుతూ ఉండేవాడు.

తల్లిదండ్రులని, భార్యని కూడా ఇబ్బంది పెట్టేవాడు.తన కుమారుడి జీవితం నాశనం అవ్వడాన్ని చూసి తట్టుకోలేక తల్లిదండ్రులు ఆ దేవుని వేడుకున్నారు.

తులసి పాలు తాగడం వలన ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..?

తర్వాత పండరీకుడికి ఎదురైన కొన్ని చేదు అనుభవాలు అతనికి జ్ఞానాన్ని వచ్చేలా చేస్తాయి.భక్తి మార్గాన్ని చూపిస్తాయి.

Advertisement

తన తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపంతో తల్లిదండ్రులకు సేవ చేస్తూ బ్రతుకుతూ ఉంటాడు.

అలాంటి సమయంలో పండరీకుడినీ పరీక్షించేందుకు స్వామి బాలుడి రూపంలో వచ్చి బయటకు పిలుస్తాడు.అప్పుడు పుండరీకుడు తల్లిదండ్రులని సేవ చేస్తున్నానని కాసేపు ఆగమంటాడు.అలా సేవ చేస్తూ ఉండిపోవడంతో బయట ఎండలోనే బాలుని రూపంలో ఉన్న స్వామి నిలబడి ఉంటారు.

కాసేపటికి పుండీరుకుడి ఒక ఇటుకను బయటకు విసిరి దానిపై నిలబడమని చెబుతాడు.తన భక్తుడు బయటకి వచ్చేవరకు పాండురంగడు ఎండలో నడుము పై చేతులు వేసుకొని నిలబడి చిద్విలాసంతో ఉంటాడు.

బయట స్వామి చేసిన విన్యాసాలను చూసి తన తప్పు తెలుసుకుంటాడు.తల్లిదండ్రుల పై అతని ప్రేమకు మెచ్చుకుని ఏ వరం కావాలో కోరుకోమని ఆదేశిస్తాడు.తనకు దర్శనం ఇచ్చినట్లు నడుము పై చేతులు వేసి భక్తులకు కూడా దర్శనం ఇవ్వమని కోరుతాడు.

తాజా వార్తలు