బద్రీనాథ్ కేదార్నాథ్ దేవాలయాల.. మూసివేతకు గల అసలైన కారణం ఇదే..!

ప్రముఖ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన చార్ ధామ్ క్షేత్రాలలో ఒకటైన కేదార్నాథ్ దేవాలయాన్ని( Kedarnath temple ),బద్రీనాథ్ దేవాలయాన్ని,గంగోత్రి యమునోత్రి దేవాలయాలను తాత్కాలికంగా మూసివేసినట్లు దేవాలయ ముఖ్య అధికారులు తెలిపారు.

ఇంకా చెప్పాలంటే దేవాలయ పరిసర ప్రాంతాలలో పెద్ద మొత్తంలో మంచు కప్పేయడంతో అక్కడ ప్రతికూల వాతావరణం ఏర్పడడం వల్ల దేవాలయాలను మూసివేస్తున్నట్లు కూడా ప్రకటించారు.

కేదార్నాథ్, బద్రీనాథ్ దేవాలయాల వద్ద ఎముకలు కొరికే చలి ఉండడంతో భక్తులు( Devotees ) వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని కూడా పండితులు చెబుతున్నారు.వేద మంత్రోచ్ఛారణల మధ్య దేవాలయ మహా ద్వారాన్ని గురువారం ఉదయం 8:30 నిమిషములకు మూసివేసినట్లు తెలిపారు.

ఆ తర్వాత కేదార్నాథ్ దేవాలయంలోని కేదార్నాథ్ స్వామిని స్వామిని ఉఖీ మఠ్ లోని ఓంకారేశ్వర దేవాలయానికి తీసుకువెళ్లారు.ఆయనకు వచ్చే ఆరు నెలల పాటు స్వామి వారికి ఇక్కడే పూజాధికాలను నిర్వహిస్తారు.అంతే కాకుండా చార్ధామ్ లోని ప్రధాన పుణ్యక్షేత్రమైన యమునోత్రిని కూడా బుధవారం ఉదయం 11:30 నిమిషాములకు మూసి వేసి భక్తుల దర్శనాన్ని నిలిపివేశారు.యమునా దేవిని ఉత్తర కాశిలోని ఖర్సాలీ లోని కుషి మఠానికి తీసుకెళ్లారు.

అంతే కాకుండా మంగళవారం రోజు గంగోత్రిని సైతం మూసి వేసిన చార్ధామ్ దేవాలయాధికారులు నవంబర్ 18 వ తేదీన బద్రీనాథ్ దేవాలయాన్ని మూసివేస్తామని ప్రకటించారు.

Advertisement

అలాగే ప్రతి ఏడాది ఈ దేవాలయాలు నవంబర్ నెల నుంచి మే నెల వరకు మంచు తో కప్ప బడి ఉంటాయి.అలాగే కేదార్నాథ్ దేవాలయాన్ని మూసివేసే సమయంలో ఇక్కడ చలి ఎక్కువగా ఉన్నా కూడా 2500 మంది భక్తులు స్వామి దర్శించుకునే కార్యక్రమంలో పాల్గొన్నారు.హిమాలయాల( Himalayas ) మధ్యలో ఉన్న ఈ పవిత్ర దేవాలయానికి చేరుకోవడం అంతా సులభమైన విషయం కాదు.

ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణం చేయవలసి ఉంటుంది.అక్కడకు వెళ్లి ఒక సారి స్వామిని దర్శించుకుంటే చాలు జన్మజన్మల పుణ్యఫలం లభిస్తుందని చాలా మంది భక్తులు నమ్ముతారు.

Advertisement

తాజా వార్తలు