తల్లులకు తర్పణం సమర్పించే ఏకైక ప్రాంతం ఇదే..!

మన జీవితంలో ఎన్నో సంస్కారాలను, ఆచారాలను పాటిస్తూ ఉంటాము.సనాతన ధర్మం మన జీవితంలో ముఖ్యంగా ఒక పక్షం రోజులు.

కేవలం ఈ రోజులను పూర్వీకుల కోసమే కేటాయించారు.దాన్ని పితృపక్షం అని పిలుస్తారు.

మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అనేక కర్మలు ఉంటాయి.చనిపోయిన తర్వాత కూడా అంత్యక్రియలు మిగతా సంస్కారాలు చేయాల్సి ఉంటుంది.

చనిపోయిన వారిపై ఇంకా గౌరవం మర్యాదలు కొనసాగించాల్సి ఉంటుంది.అందుకే శ్రాద్ధం, తర్పణం( Shraddham , tarpanam ) వంటివి చేస్తారు.

This Is The Only Area Where Tarpanam Is Offered To Mothers , Siddupur, Patan , G
Advertisement
This Is The Only Area Where Tarpanam Is Offered To Mothers , Siddupur, Patan , G

కొన్ని ప్రాంతాలలో పితృ కర్మకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది.గుజరాత్ రాష్ట్రంలోని పటాన్ జిల్లాలో( Patan , Gujarat state ) ఉన్న సిద్దుపూర్( Siddupur ) కేవలం మాతృదేవతలకు శ్రాద్ధం పెట్టే ఏకైక ప్రాంతం అని స్థానిక ప్రజలు చెబుతున్నారు.ఈ సిద్ధాపూర్ ప్రాముఖ్యత గురించి ఋగ్వేదంలో వివరంగా ఉంది.

సరోవర్‌ సిద్దాపూర్ గురించి ఒక కథ మన పురాణాలలో ఉంది అని పండితులు చెబుతున్నారు.ప్రాచీన కాలంలో కపిల ( Kapila )అనే సాధువు ఉండేవాడు.

అతని తల్లి పేరు దేవాహుతి, తండ్రి కర్దం.కపిలుడు ముని సంఖ్యాతత్వం శాస్త్ర స్థాపకుడు.

ఒక రోజు అతని తండ్రి కర్దం తపస్సు కోసం అడవికి వెళ్ళవలసి ఉంటుంది.అప్పుడు తల్లి దేవహుతి( Devahuti ) చాలా విచారంతో బిందు సరోవర్‌ ఒడ్డున ప్రాణం విడిచి పెడుతుంది.

This Is The Only Area Where Tarpanam Is Offered To Mothers , Siddupur, Patan , G
న్యూస్ రౌండప్ టాప్ 20

అప్పుడు కుమారుడైన కపిలుడు విష్ణువు పై దృష్టిని కేంద్రీకరిస్తాడు.ధ్యానం చేస్తుండగా తన తల్లి దేవహుతి దేవలోకానికి వెళ్లారని గ్రహిస్తాడు.అప్పుడు బిందు సరోవర్‌ ఒడ్డున తల్లి మరణించినందుకు మోక్షం కల్పించడానికి అక్కడే కర్మ చేస్తాడు.

Advertisement

అప్పుడు నుంచి ఈ ప్రదేశం మాతృ మోక్ష ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది.గుజరాత్ లోని మరో ప్రముఖ క్షేత్రం ద్వారక నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఈ ప్రాంతంలో ఒక సరస్సు కూడా ఉంటుంది.యాత్రికులు ఈ చెరువు ఒడ్డున శ్రద్ధకర్మలు చేసి చెరువులో వదులుతారు.

ఈ నది ప్రత్యేకత ఏమిటంటే అందులో పడిన వస్తువులు మునిగిపోకుండా పైకి తేలుతూ ఉంటాయి.

తాజా వార్తలు