ఏఎన్నార్ బాలయ్యను సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నారా ?

స్టార్ హీరో బాలయ్య చేసిన వివాదాస్పద వ్యాఖ్యల గురించి సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు.

ప్రముఖ నటుడు, నిర్మాత త్రిపురనేని చిట్టిబాబు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

అక్కినేని హీరోలు ఈ వ్యాఖ్యల గురించి ఇంతలా స్పందించాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.బాలయ్య ఫ్లోలో ఆ మాట అన్నాడని అంతే తప్ప కావాలని అనలేదని చిట్టిబాబు తెలిపారు.

తెలుగులో పర్యాయపదాలు ఎక్కువని బాలయ్య మనసులో అక్కినేని ఫ్యామిలీని కించపరచాలని లేదని చిట్టిబాబు పేర్కొన్నారు.బాలయ్యకు కంట్రోల్ ఉండదని ఆయన పేర్కొన్నారు.

బాలయ్య అక్కినేని తొక్కినేని అనడం తప్పేనని అయితే బాలయ్యకు ఏఎన్నార్ కు మంచి అనుబంధం ఉందని ఆయన కామెంట్లు చేశారు.బాలయ్య ఏఎన్నార్ మధ్య అనుబంధం నాగార్జునకు కూడా తెలుసని చిట్టిబాబు చెప్పుకొచ్చారు.

Advertisement

ఏఎన్నార్ బాలయ్య ఫ్రెండ్స్ లా ఉండేవారని సరదాగా కాలక్షేపం చేసేవారని ఆయన తెలిపారు.నాగ్ బాలయ్య మధ్య కంటే ఏఎన్నార్ బాలయ్య మధ్య చనువు ఎక్కువగా ఉండేదని చిట్టిబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఏఎన్నార్ తో గొడవ గురించి బాలయ్యను నేను అడిగినా చెప్పలేదని చిట్టిబాబు పేర్కొన్నారు.

బాలయ్యకు కోపం వస్తే డైరెక్ట్ గానే కామెంట్ చేస్తారని ఆయన తెలిపారు.

ఏఎన్నార్ బాలయ్యను సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్న సందర్భాలు ఉన్నాయని సమాచారం.బాలయ్య ఏఎన్నార్ మధ్య ఆ స్థాయి అనుబంధం ఉండేదని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.నాగార్జున కన్నా బాలయ్యతో ఏఎన్నార్ కు ఎక్కువ అనుబంధం ఉండేదని చిట్టిబాబు తెలిపారు.

ఏఎన్నార్ బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి సక్సెస్ సాధించాయి.నందమూరి అక్కినేని కుటుంబాల మధ్య ఏర్పడిన గ్యాప్ తొలగిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters
Advertisement