Phoenix Citadel Mall Madhya Pradesh : ఇండియాలో అతి పెద్ద మాల్ ఇదే .. 19 ఎకరాల మాల్ గురించి మీకు తెలుసా ?

చాలా మందికి మాల్స్ కు వెళ్లడం అంటే భలే సరదా.మాల్స్ లో ప్రతి ఒక్కటీ అందుబాటులో ఉంటుంది.

చిన్న పిల్లల గేమ్స్ దగ్గరి నుంచి పెద్ద వాళ్లు సినిమా చూసే వరకూ కూడా అన్ని వినోదభరిత వేదికలు మాల్స్ లో ఏర్పాటై ఉంటాయి.షాపింగ్స్, ఫుడ్ కోర్ట్, సినిమా థియేటర్స్, స్పా సెంటర్స్ ఇలా ఒక్కటేమిటీ ప్రతి ఒక్కటీ కూడా మాల్స్ లో అందుబాటులో ఉంటుంది.

మన దేశంలో అనేక మాల్స్ ఉన్నాయి.ముఖ్యంగా ప్రధాన నగరాల్లో మాల్స్ సంఖ్య భారీగానే ఉంది.

అయితే ఇప్పుడు దేశంలోనే అతి పెద్ద మాల్ వెలసింది.ఇంతకీ అది ఎక్కడుందో, దాని విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో దేశంలోనే అతి పెద్ద మాల్ వెలసింది.ఈ మాల్ ను ఫీనిక్స్ మీల్స్ ఏర్పాటు చేసింది.

సుమారు 19 ఎకరాల్లో ఈ మాల్ ఏర్పాటై అందర్నీ ఆకర్షిస్తోంది.ఫీనిక్స్ సిటాడెల్ మాల్ ఏర్పాటుకు ఆ సంస్థ రూ.800 కోట్లు ఖర్చు చేసింది.కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్ మెంట్ బోర్డు ఈ మాల్ ను నిర్మించింది.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ మాల్ మెయిన్ బిల్డింగ్ ఉంది.ఈ మాల్ లో దాదాపు 300 దుకాణాలు ఉన్నాయి.

రాబోవు సంవత్సరంలో ఈ మాల్ లోని షాప్స్ ద్వారా రూ.1000 కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.మాల్ లో ప్రత్యేకంగా ఉన్న ఎక్సలేటర్లు, సీటింగ్ అరేంజ్ మెంట్లు, అలాగే అద్దాలతో అలంకరణలో అందర్నీ ఇట్టే ఆకర్షిస్తున్నాయి.

ఇంత పెద్ద మాల్ ను రోజుకు కొన్ని వేల మంది సందర్శించి తమకు కావాల్సిన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు.వచ్చే ఏడాది ఈ బిజినెస్ వెయ్యి కోట్లు దాటనుందంటే ఇక్కడ ఎలా వ్యాపారం జరుగుతుందో మీరే అర్థం చేసుకోవచ్చు.

ల‌వ్ లో ఉండ‌గా... టెలిగ్రామ్ పంపిన అనుభూతి.! ఇప్ప‌టికీ ఆ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ యా ఆయ‌న న‌న్ను ఆట‌ప‌ట్టిస్తుంటారు.!
Advertisement