కంటికి కునుకు కరువైందా.. అయితే మీరిది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

హెల్తీ గా, ఫిట్ గా ఉండాలంటే పోషకాహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం ఎంత ముఖ్యమో కంటి నిండా నిద్ర( sleep ) ఉండడం కూడా అంతే ముఖ్యం.

కంటికి కునుకు కరువైతే ఎన్ని చేసినా వృధానే.

కంటి నిండా నిద్ర లేకపోవడం వల్ల అధిక బరువు, మధుమేహం, గుండెపోటు ఇలా ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.అందుకే ఆరోగ్య నిపుణులు రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రించాలని పదేపదే చెబుతుంటారు.

కానీ ఇటీవల రోజుల్లో చాలా మంది నిద్రలేమి సమస్యతో తీవ్రంగా సతమతం అవుతున్నారు.ఈ స‌మ‌స్య వల్ల ఎంత ప్రయత్నించిన నిద్ర రానే రాదు.

ఈ క్రమంలోనే ఎక్కువ శాతం మంది నిద్ర పట్టడానికి మందులు వాడుతుంటారు.అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే సహజంగా కూడా నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చు.

Advertisement
This Is The Best Way To Get Rid Of Insomnia! Sleeping Disorder, Insomnia, Health

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను రోజు నైట్ తీసుకుంటే ప్రశాంతమైన నిద్ర మీ సొంతం అవుతుంది.ఇంతకీ మ‌రి ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

This Is The Best Way To Get Rid Of Insomnia Sleeping Disorder, Insomnia, Health

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ లో-ఫ్యాట్ మిల్క్( Fat milk ) ను పోసుకోవాలి.పాలు కాస్త హీట్ అవ్వగానే అందులో పావు టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి( Cinnamon powder ), పావు టేబుల్ స్పూన్‌ పసుపు, పావు టేబుల్ స్పూన్ జాజికాయ పొడి( Nutmeg powder ), పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి ( Cardamom powder )వేసుకొని ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మరిగించాలి.ఇలా మరిగించిన మిల్క్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని బెల్లం పొడి లేదా తేనె కలుపుకుని సేవించాలి.

This Is The Best Way To Get Rid Of Insomnia Sleeping Disorder, Insomnia, Health

నైట్ నిద్రించడానికి గంట ముందు ఈ పాలను తీసుకోవాలి.ఈ పాలు నిద్రను ప్రేరేపించడంలో అద్భుతంగా సహాయపడతాయి.నిద్రలేమిని దూరం చేస్తాయి.

రోజు నైట్ ఈ మిల్క్ ను తాగితే ప్రశాంతమైన సుఖమైన నిద్ర మీ సొంతం అవుతుంది.పైగా ఈ పాలను రోజు నైట్ తాగితే పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు

కొద్దిరోజుల్లోనే బాన పొట్ట నాజూగ్గా మారుతుంది.మరియు చర్మం కూడా కాంతివంతంగా ఆకర్షణీయంగా మారుతుంది.

Advertisement

తాజా వార్తలు