ర‌క్త‌హీన‌త‌తో బాధ‌ప‌డుతున్నారా? అయితే ఈ ఒక్క‌టి మీ డైట్‌లో ఉండాల్సిందే!

ర‌క్త‌హీన‌త‌.దీనినే ఎనీమియా అని పిలుస్తుంటారు.

శ‌రీరంలో రక్తం తక్కువగా ఉండటం ద్వారా వచ్చే వ్యాధినే ఎనీమియా అని అంటారు.

పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా కోట్లాది మందిని చాలా కామ‌న్‌గా వేధించే స‌మ‌స్య ఇది.అందులోనూ ఇటీవ‌ల రోజుల్లో ర‌క్త‌హీన‌త అనేది మ‌రింత అధికంగా ఇబ్బంది పెడుతోంది.ర‌క్త‌హీన‌త అనుకున్నంత చిన్న స‌మ‌స్యేమి కాదు.

దీనిని నిర్ల‌క్ష్యం చేస్తే ప్రాణాల‌కే ప్ర‌మాదంగా మారుతుంది.అందుకే ర‌క్త‌హీన‌త‌ను వీలైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రించుకోవాల‌ని నిపుణులు సూచిస్తుంటారు.

మీరూ ర‌క్త‌హీన‌త బాధితులేనా.? అయితే అస్స‌లు బాధ‌ప‌డ‌కండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే ఒక్క డ్రింక్‌ను మీ డైట్‌లో చేర్చుకుంటే ర‌క్త‌హీన‌త ప‌రార్ అవ్వ‌డ‌మే కాదు.

Advertisement

మ‌ళ్లీ మ‌ళ్లీ మీ ద‌రి దాపుల్లోకి రాకుండా కూడా ఉంటుంది.మ‌రి లేట్ చేయ‌కుండా ర‌క్త‌హీన‌త‌ను త‌రిమి కొట్టే ఆ డ్రింక్ ఏంటో.దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం ప‌దండీ.

ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వ‌న్ టేబుల్ స్పూన్ పొద్దు తిరుగుడు గింజ‌లు, వ‌న్ టేబుల్ స్పూన్ గుమ్మ‌డి గింజ‌లు, వ‌న్ టేబుల్ స్పూన్ పుచ్చ గింజ‌లు, మూడు జీడిప‌ప్పులు, నాలుగు బాదం ప‌ప్పులు, రెండు వాల్ న‌ట్స్‌, రెండు డ్రై అంజీర్‌, నాలుగు గింజ తొల‌గించిన ఖ‌ర్జూరాలు, నాలుగు న‌ల్ల ఎండు ద్రాక్ష‌లు, హాఫ్ టేబుల్ స్పూన్ అవిసె గింజ‌లు, వ‌న్ టేబుల్ స్పూన్ చియా సీడ్స్‌, ఒక క‌ప్పు వాట‌ర్ వేసుకుని బాగా క‌లిపి నైట్ అంతా నాన‌బెట్టుకోవాలి.

ఉద‌యాన్నే బ్లెండ‌ర్‌లో నానబెట్టుకున్న ప‌దార్థాలు, ఒక గ్లాస్ కాచి చ‌ల్లార్చిన‌ ఆవు పాలు, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకుంటే.టేస్టీ అండ్ హెల్తీ డ్రింక్ సిద్ధ‌మైన‌ట్లే.ఈ ఒక్క డ్రింక్‌ను మీ రెగ్యుల‌ర్ డైట్‌లో చేర్చుకుంటే ర‌క్త‌హీన‌త క్ర‌మంగా త‌గ్గిపోవ‌డ‌మే కాదు.

మ‌ళ్లీ మ‌ళ్లీ ఇబ్బంది పెట్ట‌కుండా కూడా ఉంటుంది.

సింహాచలం దేవస్థానం ఈవోగా వి త్రినాథ్ రావు
Advertisement