ఇది రాంగోపాల్ వర్మ ఎగ్జిట్ పోల్ .. లాజిక్ అడక్కండి

వివాదాలు ఎక్కడుంటే అక్కడకు వెతుక్కుని వెళ్లి మరి వార్తల్లో ఉంటూ ఉంటారు సంచలనాల దర్శకుడు రాం గోపాల్ వర్మ.సినిమా ల విషయంలోనే కాకుండా గత కొంతకాలంగా ఏపీ రాజకీయాల పైన వర్మ స్పందిస్తూ, తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ, వైసిపికి పరోక్షంగా మద్దతు పలుకుతున్నారు.

టిడిపి.జనసేన పైన పంచ్ డైలాగులు వేస్తూ, వార్తలు వ్యక్తిగా ఉంటున్నారు.

వర్మ చేసే కామెంట్స్ పై టిడిపి, జనసేన శ్రేణులు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నా వర్మ మాత్రం అవేవీ పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు.ఎన్నికలకు ముందు వరకు ఏపీ రాజకీయాలపై యాక్టివ్ గా ఉన్నట్టుగా కనిపించిన రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma )చాలా కాలంగా సైలెంట్ అయిపోయారు.

తాజాగా ఎగ్జిట్ పోల్స్ విడుదల కావడంతో రాజకీయ పార్టీల నేతలు వీటిపై రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.ఎవరికి వారు గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.

This Is Ramgopal Varma Exit Poll No Ask For Logic, Ramgopal Varma, Rgv, Ap Gover
Advertisement
This Is Ramgopal Varma Exit Poll No Ask For Logic, Ramgopal Varma, Rgv, Ap Gover

ఎగ్జిట్ పోల్స్ విడుదలైన తర్వాత కాస్త ఆలస్యంగా వాటిపై రాంగోపాల్ స్పందించారు .ఎగ్జిట్ పోల్స్ లెక్కల ప్రకారం కేంద్రంలో మరోసారి బిజెపి ప్రభుత్వం ఏర్పడబోతోందని, ఎన్డీఏ కూటమికి 370 సీట్లు వస్తాయని తేల్చారు.అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు( AP Assembly Elections ) ఫలితాలపై వెళ్లడైన ఎగ్జిట్ పోల్స్ ఆసక్తికరమైన చర్చకు తెర తీశాయి.

పెద్ద ఎత్తున సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ అంటూ వెలువరించిన అంచనాలు ఏపీ రాజకీయాల్లో గందరగోళంకు కారణం అయ్యాయి.ఖచ్చితంగా ఫలితం ఎలా ఉండబోతుందనేది ఎవరికి అంతుపట్టని విషయంగా ఉంది.

ఈ విషయంలోనే రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.ఈ మేరకు తన సోషల్ మీడియా ఎకౌంట్ ఎక్స్ లో ఒక నెటిజన్ పోస్ట్ చేసిన పోస్ట్ ను రీ ట్వీట్ చేస్తూ అదే తన అభిప్రాయంగా రాం గోపాల్ వర్మ పేర్కొన్నారు.

This Is Ramgopal Varma Exit Poll No Ask For Logic, Ramgopal Varma, Rgv, Ap Gover

ఈ ట్వీట్ లో ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసిపి, టిడిపి కూటమి 0 -175 స్థానాల్లో ఎన్నైనా గెలుచుకోవచ్చని అన్నారు.అలాగే ఏపీలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లోనూ 25 ఎంపీ స్థానాల్లో, ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు 0-25 స్థానాల్లో ఎన్నైనా గెలుచుకోవచ్చు అన్నారు.సిరాశ్రీ పేరుతో ఎక్స్ యూజర్ పెట్టిన పోస్టును ఆర్జీవి రీ ట్వీట్ చేస్తూ ఇది అత్యంత ఖచ్చితమైన సర్వే అంచనా అంటూ పేర్కొన్నారు.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు