వివరణ ఇవ్వడానికి ఇది వేదిక కాదు.. నెటిజన్ కు కౌంటర్ ఇచ్చిన హరీష్ శంకర్ !

ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న డైరెక్టర్ హరీష్ శంకర్(Harish Shankar) పలు సినిమాలకు దర్శకత్వం వహిస్తూ ఎంతో పేరు పొందారు.

ఇక తాజాగా ఈయన పవన్ కళ్యాణ్(Pawankalyan) హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్(Ustad Bhagath Singh) అనే సినిమాను తెరెక్కిస్తున్నారు.

ఇక ఈ సినిమా ప్రకటించి చాలా రోజులు అయినప్పటికీ ఇలా ఈ సినిమా షూటింగ్ గురించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో నెటిజన్స్ ఈ సినిమా గురించి ఆరా తీస్తున్నారు.ఈ క్రమంలోనే ఓ నెటిజన్ ట్విట్టర్ వేదికగా ఈ సినిమా గురించి డైరెక్టర్ శంకర్ ను ప్రశ్నించారు.

This Is Not The Platform To Give An Explanation Harish Shankar Countered The Net

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను కోలీ వుడ్ సూపర్ హిట్ చిత్రం తేరి సినిమాకు రీమేక్ గా తెరెకెక్కిస్తున్నారనీ తెలుస్తుంది.సుమారు మూడు సంవత్సరాల సమయం తీసుకొని రీమేక్ తీయడం ఏంటీ అని ప్రశ్నించారు.షాక్.

మిరపకాయ్, గబ్బర్ సింగ్,రామయ్యా వస్తావయ్యా వంటి సినిమాలను తీసిన మీరు మూడు సంవత్సరాల సమయం తీసుకొని ఈ సినిమా చేయడం ఏంటని? ఇప్పుడు తీస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కూడా రీమేక్ అంట కదా అని నెటిజన్ ట్వీట్ చేశారు.

This Is Not The Platform To Give An Explanation Harish Shankar Countered The Net
Advertisement
This Is Not The Platform To Give An Explanation Harish Shankar Countered The Net

ఈ విధంగా నెటిజన్ చేసిన ఈ ట్వీట్ కి హరీష్ శంకర్ స్పందిస్తూ.కేవలం భావాలను వ్యక్తం చేయడానికి ట్విట్టర్ అనేది ఒక వేదిక మాత్రమే కానీ, వివరణ ఇవ్వడానికి కాదు అంటూ డైరెక్టర్ కౌంటర్ ఇచ్చారు.ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక ఈ ట్వీట్ పై నెటిజన్స్ స్పందిస్తూ డైరెక్టర్ హరీష్ శంకర్ కి మద్దతు తెలుపగా మరికొందరు మాత్రం అన్నా నిజంగానే ఇది రీమేక్ చిత్రమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక పవన్ కళ్యాణ్ మాత్రం ప్రస్తుతం సినిమాలు,రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు