Foldable house : ఇదేందయ్యా ఇది.. అమెజాన్‌లో ఫోల్డబుల్ హౌస్ కొనుగోలు చేసిన వ్యక్తి.. రేట్ ఎంతంటే..

ప్రపంచవ్యాప్తంగా చాలా మంది యువకులు ఇల్లు కొనలేకపోతున్నారు.ఎందుకంటే అవి చాలా ఖరీదైనవి.

అందుకే ఇంటిని సొంతం చేసుకోవడానికి కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు.తాజాగా అమెరికాకు చెందిన 23 ఏళ్ల యువకుడు అమెజాన్ నుంచి ఇల్లు కొనుగోలు చేశాడు.

అదేంటి అమెజాన్ ఇళ్లు కూడా అమ్ముతుందా? అదేమైన బొమ్మ ఇల్లా అని అనుకోకండి.అది నిజమైన ఇల్లే, కాకపోతే ఫోల్డబుల్ హౌస్( Foldable house ).దాన్ని మడతపెట్టి ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లవచ్చు.ఈ ఇంటి గురించి సదరు యూఎస్ వ్యక్తి టిక్‌టాక్‌లో వీడియో చేశాడు.

అతను అమెజాన్( Amazon ) నుంచి కొనుగోలు చేసిన తన కొత్త ఇంటిని చూపించాడు.అతని పేరు జెఫ్రీ బ్రయంట్( Jeffrey Bryant ), అతను లాస్ ఏంజిల్స్‌లో నివసిస్తున్నాడు.

Advertisement
This Is It The Person Who Bought The Foldable House On Amazon What Is The Rate-

"నేను అమెజాన్‌లో ఇల్లు కొన్నాను.దాని గురించి పెద్దగా ఆలోచించలేదు కూడా" అని అతను వీడియోలో చెప్పాడు.

చాలా మంది ఆ వీడియోను చూసి ఆశ్చర్యపోతున్నారు.ఇప్పుడా వీడియో బాగా పాపులర్ అయింది.

This Is It The Person Who Bought The Foldable House On Amazon What Is The Rate

ఇల్లు చాలా పెద్దది కాదు.ఇది 16.5 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉంటుంది.దీని ధర 26,000 డాలర్లు (రూ.21,37,416).ఇందులో ఒక షవర్, ఒక టాయిలెట్, ఒక చిన్న కిచెన్, ఒక రూమ్, ఒక బెడ్‌రూమ్ ఉన్నాయి.

జెఫ్రీ చనిపోయాక తన తాత వదిలేసిన డబ్బుతో ఆ ఇంటిని కొన్నాడు.ఇలాంటి ఇల్లు కొన్నది జెఫ్రీ మాత్రమే కాదు.మరికొంత మంది ఆన్‌లైన్‌లో చిన్న ఇళ్లను కూడా కొనుగోలు చేశారు.

విజిల్ పోడు.. పుష్ప ఎంట్రీతో అదరగొట్టిన జడ్డు భాయ్!
రీ రిలీజ్ లో సంచలనం సృష్టించిన సీతమ్మ వాకిట్లో.. మూడు రోజుల కలెక్షన్ల లెక్కలివే!

అవి చౌకగా, హాయిగా ఉండటం వల్ల తమకు నచ్చిందని చెప్పారు.ఒక వ్యక్తి అమెజాన్‌లో "థిస్ ఇస్ లవ్! ఇది చవకైనది, నాకు, నా కుక్కకు సరిపోతుంది! హైలీ రికమెండెడ్.

Advertisement

" అని తెలిపింది.అయితే ఇంటర్నెట్‌లో కొంతమందికి అవి నచ్చలేదు.

వారు ఈ ఇంటిపై పెట్టే డబ్బు పెట్టడం వృధా అని అన్నారు.

ఆ ఇంటిని ఎందుకు కొన్నాడో జెఫ్రీ న్యూయార్క్ పోస్ట్‌తో వివరించాడు."ఒక యూట్యూబర్ తన అమెజాన్ ఇంటిని అన్‌బాక్స్ చేయడం నేను చూశా.నేను కూడా అలాంటి ఒక ఇల్లు పొందడానికి వెబ్‌సైట్‌కి పరిగెత్తాను.

" అని చెప్పారు.అయితే అతను ఇల్లు కొనేయగానే అతడి పని అయిపోలేదు.

ఇంకా చాలానే ఇతర పనులు చేయాల్సి వచ్చింది.అతడు విద్యుత్, నీటిని కనెక్ట్ చేయాల్సి వచ్చింది.

అయితే ఈ ఇంట్లో తాను ఉండనని కూడా అతడు చెప్పాడు.ఉండడానికి స్థలం అవసరమైన వారికి అద్దెకు ఇస్తానని పేర్కొన్నాడు.

రియల్ ఎస్టేట్ ఏజెంట్‌తో కలిసి పని చేస్తూ ఫోల్డబుల్ ఇంటిని ఎక్కడంటే అక్కడ ఇన్‌స్టాల్ చేసి డబ్బు పొందాలని ఆశిస్తున్నాడు.

తాజా వార్తలు