ఇదేం పిచ్చిరా బాబు.. ఫోన్‌లోని ఫుడ్ ఎమోజీలన్నీ తినడానికి ఈ వ్యక్తి ఎంత సాహసం చేశాడంటే!

మీకు బాగా ఇష్టమైన ఫుడ్ కోసం ఎంత దూరం వెళ్తారు మహా అయితే పక్క ఊరు లేదా పక్క రాష్ట్రం.

కానీ, ఫుడ్ లవర్స్ కి దూరం ఒక లెక్క కాదు.

అమెరికాకు చెందిన రిక్ షాపర్ అనే వ్యక్తి ఫుడ్ మీద తనకున్న వెర్రి ప్రేమను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాడు.మన ఫోన్ కీబోర్డులో ఉండే ఫుడ్ ఎమోజీలు ఉన్నాయి కదా, వాటిల్లో కనిపించే ప్రతీ వంటకాన్ని తినాలనే వింత లక్ష్యంతో ఏకంగా అమెరికా నుంచి జపాన్‌కు విమానం ఎక్కేశాడు.

This Is Crazy, How Dare This Guy Eat All The Food Emojis On His Phone, Emoji Foo

రిక్ షాపర్ తన ఈ క్రియేటివ్ ఫుడ్ జర్నీని మొత్తం వీడియో తీసి అందరితో పంచుకున్నాడు.ఆ వీడియోలో అతను జపాన్ వీధుల్లో చక్కర్లు కొడుతూ, రకరకాల అసలైన వంటకాలను టేస్ట్ చేయడం చూడొచ్చు.పాపులర్ పాన్-ఫ్రైడ్ డంప్లింగ్స్ అయిన గ్యోజా ( Gyoza ) నుంచి మొదలుపెట్టి, ఒనిగిరి ( Onigiri - రైస్ బాల్స్ ), డాంగో (Dango - స్వీట్ రైస్ డంప్లింగ్స్), సుషీ ( Sushi ), రామెన్ ( Ramen ) వరకు.

ఇలా ఎమోజీ రూపంలో ఉన్న ప్రతీ ఫుడ్‌ను రుచి చూశాడు.అతను ఏ వంటకం తింటుంటే, దానికి సంబంధించిన ఎమోజీ స్క్రీన్‌పై కనిపించడం ఈ వీడియోను మరింత సరదాగా, క్రియేటివ్‌గా మార్చింది.

This Is Crazy, How Dare This Guy Eat All The Food Emojis On His Phone, Emoji Foo
Advertisement
This Is Crazy, How Dare This Guy Eat All The Food Emojis On His Phone, Emoji Foo

తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో, రిక్ కొన్ని సూపర్ ఫుడ్ స్పాట్‌లను కూడా సజెస్ట్ చేశాడు.అవేంటంటే కమ్మటి రామెన్ తినాలంటే - కోబె చైనాటౌన్ ( Kobe Chinatown ), ఫ్రెష్, అసలైన సుషీ రుచి చూడాలంటే - షింజుకులోని షింజుకు సకేజుషి ( Shinjuku Sakaezushi ).రిక్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది.ఈ నెల మొదట్లో పోస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు 44 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

రియల్ ఫుడ్‌ను ఎమోజీలతో కలిపి చూపించిన ఈ కాన్సెప్ట్‌కు నెటిజన్లు ఫిదా అయిపోయారు."ఇది చాలా సరదాగా ఉంది." అని ఒకరు కామెంట్ చేస్తే, "అరెరే, ఆ ఫుడ్ ఎమోజీలు భలే యాడ్ చేశారు.

" అని మరొకరు రాశారు.రిక్ చేసిన ఈ క్రియేటివ్ ఫుడ్ అడ్వెంచర్, జపాన్ రుచులను ఇలాంటి ఫన్ ట్విస్ట్‌తో ఎక్స్‌ప్లోర్ చేయడానికి చాలా మందికి స్ఫూర్తినిచ్చింది.

కెనడాలో ఇండియన్ స్టూడెంట్‌కు పాకిస్థానీ భారీ టిప్.. ఎంత ఇచ్చాడో తెలిస్తే షాక్!
Advertisement

తాజా వార్తలు