చిగుళ్ల వాపుతో ఇబ్బంది ప‌డుతున్నారా? అయితే వెంట‌నే ఇలా చేయండి!

చిగుళ్ల వాపు.చాలా మంది సర్వసాధారణంగా ఫేస్ చేసే సమస్యల్లో ఇది ఒకటి.

నోటి శుభ్రత లేకపోవడం, బ్యాక్టీరియా, కఠినమైన టూత్ బ్రష్ లు వాడటం, ఆహారపు అలవాట్లు, చిగుళ్లపై పాచి పేరుకు పోవడం, ధూమపానం తదితర కారణాల వల్ల చిగుళ్ల వాపు సమస్య ఏర్పడుతుంది.కారణం ఏదైనప్పటికీ చిగుళ్ల వాపు వల్ల తీవ్రమైన అసౌకర్యానికి గురవుతుంటారు.

పైగా చిగుళ్ల వాపు వ‌ల్ల ఏం తినాల‌న్నా, తాగాల‌న్నా ఇబ్బంది ప‌డుతుంటారు.ఈ క్రమంలోనే చిగుళ్ల వాపును నివారించుకోవడానికి తెగ ప్రయత్నిస్తూ ఉంటారు.

అయితే ఇప్పుడు చెప్పబోయే చిట్కాను పాటిస్తే చాలా సులభంగా మరియు వేగంగా చిగుళ్ల వాపును నివారించుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.

Advertisement
This Is An Effective Remedy To Reduce Gum Inflammation! Effective Remedy, Reduce

స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ ను పోయాలి.వాట‌ర్ కాస్త హీట్ అవ్వగానే అందులో రెండు బిర్యానీ ఆకులు, ఐదు నుంచి ఎనిమిది లవంగాలు వేసి క‌నీసం ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.

ఇలా మరిగించిన నీటిని స్ట్రైన‌ర్ స‌హాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ గోరు వెచ్చగా అయిన అనంతరం అందులో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను మిక్స్ చేయాలి.

This Is An Effective Remedy To Reduce Gum Inflammation Effective Remedy, Reduce

ఇప్పుడు ఈ వాటర్ ను నోట్లో పోసుకుని కనీసం నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు బాగా పుక్కిలించాలి.అనంతరం నార్మల్ వాటర్ తో నోటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు రెండు లేదా మూడు సార్లు కనుక చేస్తే చిగుళ్ల వాపు చాలా త్వరగా తగ్గిపోతుంది.

అలాగే నోట్లో ఏమైనా బాక్టీరియా ఉంటే నాశనం అవుతుంది.చిగుళ్ళ నుండి రక్తస్రావం, నోటి పూత వంటి సమస్యల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.కాబ‌ట్టి, చిగుళ్ల వాపుతో బాధ‌ప‌డేవారు తప్ప‌కుండా ఈ రెమెడీని ప్ర‌య‌త్నించండి.

హీరో హీరోయిన్స్ గా నటించి అన్నాచెల్లెళ్లుగా చేసిన టాలీవుడ్ యాక్టర్స్
Advertisement

తాజా వార్తలు