ఇదేం ట్రిక్ సామీ.. ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయకపోయినా నెలలపాటు ఫ్రెష్‌గా ఉంటున్న ద్రాక్షపండ్లు..!

సాధారణంగా ఏ పండ్లు అయినా సరే కోసిన కొద్దిరోజుల్లోనే పాడైపోతాయి.వీటిని కాస్త ఎక్కువ కాలం నిల్వ చేయడానికి రిఫ్రిజిరేటర్ లో స్టోర్ చేయొచ్చు.

అయితే ఎలాంటి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేయకుండానే నెలలపాటు ద్రాక్ష పండ్లను ఫ్రెష్ గా ఉంచగలుగుతున్నారు ఆఫ్ఘనిస్థాన్ ప్రజలు.వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నమ్మాల్సిందే.

దాదాపు ఎడారిలా ఉండే ఈ దేశంలో మండే ఎండలు ఎక్కువ.అయినప్పటికీ అక్కడి ప్రజలు ఒక ట్రిక్ ఉపయోగించి ద్రాక్ష పండ్లను ఏకంగా ఆరు నెలల పాటు స్టోర్ చేయగలుగుతున్నారు.

వివరాలలోకి వెళ్తే.ఆఫ్ఘనిస్థాన్ లో నివసించే చాలామంది ప్రజలు చాలా ఏళ్లుగా ద్రాక్ష పండ్ల తోటలు సాగుచేస్తున్నారు.

Advertisement

అలాగే వీటిని చాలా ఖరీదుకు విదేశాలకు ఎగుమతి చేసి సొమ్ము చేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే ద్రాక్షను ఎక్కువగా కాలం పాటు నిల్వ చేయడానికి ఒక ట్రిక్కు కనిపెట్టారు.

ఈ టెక్నిక్ కి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.@TheFigen అనే ట్విట్టర్‌ యూజర్ షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది.

వైరల్ అవుతున్న వీడియోలో కొందరు ప్రజలు ప్రత్యేకమైన మట్టిపాత్రలో ద్రాక్ష పండ్లను ఉంచడం చూడొచ్చు.ఇలా మట్టి పాత్రలో ఉంచిన ద్రాక్షపండ్లు సుమారు ఆరు నెలల పాటు తాజాగా ఉంటాయట.

మట్టిపాత్రలోకి ఎలాంటి గాలి చొరబడకుండా ఉండటం వల్లే ఇవి ఇన్ని నెలల పాటు తాజాగా ఉంటాయని కొందరు చెబుతున్నారు.ఏదిఏమైనా ఈ టెక్నిక్ తెలుసుకుని నెటిజన్లు వావ్ అంటున్నారు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
వైరల్ వీడియో : రేవ్ పార్టీలో యాక్టర్ రోహిణి నిజంగానే దొరికిందా లేక ప్రాంకా..?

మీరు కూడా ఈ వీడియోని చూసేయండి.

Advertisement

తాజా వార్తలు