ఈ సింపుల్ చిట్కా డార్క్ సర్కిల్స్ నుంచి డార్క్ స్పాట్స్ వరకు ఎన్నిటికో చెక్ పెడుతుంది!

డార్క్ సర్కిల్స్, డార్క్ స్పాట్స్.ముఖ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.తమలోని ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తాయి.

ఈ క్రమంలోనే వాటిని వదిలించుకోవడం కోసం నానా తంటాలు పడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ చిట్కాను పాటిస్తే డార్క్ సర్కిల్స్ నుంచి డార్క్ స్పాట్స్ వరకు ఎన్నిటికో సులభంగా చెక్ పెట్టవచ్చు.

మరి ఇంతకీ ఆ సింపుల్ చిట్కా ఏంటి అన్నది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక టమాటో ని తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

అలాగే తొక్క తొలగించిన ఒక బొప్పాయి ముక్కను తీసుకుని కట్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో కట్‌ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కలు, టమాటో ముక్కలు, ఐదు టేబుల్ స్పూన్లు ఆరెంజ్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Advertisement
This Is A Simple Tip To Remove Dark Circles And Dark Spots! Dark Circles, Dark S

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఆపై ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తానికి అప్లై చేసుకుని ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.

అనంతరం నార్మల్ వాటర్ తో శుభ్రంగా చర్మాన్ని క్లీన్ చేసుకోవాలి.ఇలా రోజుకు ఒకసారి కనుక చేస్తే కళ్ళ చుట్టూ ఏర్పడిన డార్క్ సర్కిల్స్ దూరం అవుతాయి.

This Is A Simple Tip To Remove Dark Circles And Dark Spots Dark Circles, Dark S

డార్క్ స్పాట్స్ క్రమంగా మాయం అవుతాయి.స్కిన్ టోన్ మెరుగుపడుతుంది.చర్మం టైట్ గా మారుతుంది.వృద్ధాప్య ఛాయ‌లు త్వరగా ద‌రి చేర‌కుండా ఉంటాయి.

మరియు చర్మం ఎల్లప్పుడూ కాంతివంతంగా మెరిసిపోతూ ఉంటుంది.కాబట్టి అందమైన మెరిసే ముఖ చర్మాన్ని కోరుకునే వారు తప్పకుండా ఈ సింపుల్ చిట్కా ను తమ డైలీ రొటీన్ లో భాగం చేసుకోండి.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?

మంచి రిజల్ట్ మీ సొంతమవుతుంది.

Advertisement

తాజా వార్తలు