ఎండ‌ల దెబ్బ‌కు మీ చేతులు న‌ల్ల‌గా మారాయా? అయితే వెంట‌నే ఇలా చేయండి!

ప్ర‌స్తుతం వేస‌వి కాలం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.మొన్నామ‌ధ్య వ‌ర్షాల కార‌ణంగా వాతావ‌ర‌ణం కాస్త చ‌ల్ల‌బ‌డినా.

మ‌ళ్లీ ఎండ‌లు విప‌రీతంగా పెరిగిపోయాయి.భానుడు భ‌గ‌భ‌గ‌మంటూ ప్ర‌జ‌ల‌పై నిప్పులు కురిపిస్తున్నాడు.

దీంతో బ‌య‌ట‌కు రావాలంటేనే జ‌నాలు జంకుతున్నారు.అయితే ఎండ‌ల్లో ప్ర‌యాణం చేసేట‌ప్పుడు ముఖాన్ని బాగానే క‌వ‌ర్ చేసుకుంటారు.

కానీ, చేతులను వ‌దిలేస్తారు.ఫ‌లితంగా ఎండ‌ల దెబ్బ‌కు చేతులు న‌ల్ల‌గా మారిపోతుంటాయి.

Advertisement

దాంతో ఆ న‌లుపును వ‌దిలించుకోవ‌డం కోసం నానా ప్ర‌య‌త్నాలు చేస్తుంటాయి.వారు, వీరు చెప్పిన చిట్కాల‌న్నీ ట్రై చేస్తుంటారు.

ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే అస్స‌లు బాధ‌ప‌డ‌కండి.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే ఎఫెక్టివ్ హోమ్ రెమెడీని ట్రై చేస్తే చాలా అంటే చాలా సుల‌భంగా న‌ల్ల‌గా మారిన చేతుల‌ను తెల్ల‌గా, అందంగా మార్చుకోవ‌చ్చు.

మరి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీ ఏంటో.ఎలా త‌యారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వ‌న్ టేబుల్ స్పూన్‌ పెస‌ర పిండి, వ‌న్ టేబుల్ స్పూన్ శెన‌గ‌పిండి, వ‌న్ టేబుల్ స్పూన్ గులాబీ రేక‌ల పొడి, వ‌న్ టేబుల్ స్పూన్ యాక్టివేటెడ్ చార్‌కోల్ పౌడ‌ర్ వేసుకుని అన్నీ క‌లిసే వ‌ర‌కు మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఇందులో వాట‌ర్ లేదా రోజ్ వాట‌ర్ ను కొంచెం కొంచెంగా వేసుకుంటూ లూజ్ స్ట్రక్చర్ వ‌చ్చే వ‌ర‌కు క‌లుపుకోవాలి.

ఉల్లి తొక్కలతో ఊడిపోయే జుట్టుకు ఎలా చెక్ పెట్టవచ్చో తెలుసా?

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని చేతుల‌కు అప్లై చేసి.ఐదు నుంచి ప‌ది నిమిషాల పాటు వ‌దిలేయాలి.ఆపై వేళ్ల‌తో మెల్ల మెల్ల‌గా స్క్ర‌బ్బింగ్ చేసుకుంటూ వాట‌ర్‌తో శుభ్రంగా చేతుల‌ను క్లీన్ చేసుకోవాలి.

Advertisement

ఇలా వర‌స‌గా మూడు రోజుల పాటు చేస్తే ఎండ‌ల దెబ్బ‌కు న‌ల్ల‌బ‌డిన చేతులు తెల్ల‌గా, అందంగా మ‌రియు మృదువుగా త‌యారు అవుతాయి.కాబ‌ట్టి, త‌ప్ప‌కుండా ఈ రెమెడీని ట్రై చేయండి.

తాజా వార్తలు