హెయిర్ ఫాల్‌, వైట్ హెయిర్‌, డాండ్రఫ్‌ల‌కు చెక్ పెట్టే ప‌వ‌ర్ ఫుల్ రెమెడీ ఇదే!

జుట్టు స‌మ‌స్య‌లంటే హెయిర్ ఫాల్‌, వైట్ హెయిర్‌, డాండ్ర‌ఫ్ వంటివే మొద‌ట‌ గుర్తుకు వ‌స్తాయి.

స్త్రీల‌నే కాదు పురుషుల‌నూ ప్ర‌ధానంగా వేధించే వాటిలో ఇవే ముందు వ‌ర‌స‌లో ఉంటాయి.

దాంతో ఆయా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవ‌డం కోసం చేయాల్సిన ప్ర‌య‌త్నాల‌న్నీ చేస్తుంటారు.ఖ‌రీదైన షాంపూలు, హెయిర్ ఆయిల్స్ వాడుతుంటారు.

అయిన‌ప్ప‌టికీ ఫ‌లితం లేకుంటే ఏం చేయాలో అర్థంగాక మ‌ద‌న ప‌డిపోతూ ఉంటాయి.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ప‌వ‌ర్ ఫుల్ రెమెడీని ట్రై చేశారంటే హెయిర్ ఫాల్‌, వైట్ హెయిర్‌, డాండ్రఫ్‌ల‌కు సుల‌భంగా చెక్ పెట్ట‌వ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు లేటు ఈ రెమెడీ ఏంటో తెలుసుకుందాం ప‌దండీ.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గ్లాస్ వాట‌ర్ పోయాలి.

Advertisement

వాట‌ర్ హీట్ అవ్వ‌గానే రెండు టేబుల్ స్పూన్ల టీ పౌడ‌ర్ వేసి బాగా మ‌రిగించి.డికాక్ష‌న్‌ను స‌ప‌రేట్ చేసి పెట్టుకోవాలి.

అలాగే బియ్యాన్ని క‌డిగి.ఆ నీటిని ప‌క్క‌న పెట్టుకోవాలి.

ఇప్పుడు ఒక క‌ల‌బంద ఆకును నీటిలో శుభ్రంగా క‌డిగి చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత బ్లెండ‌ర్ తీసుకుని అందులో క‌ట్ చేసి పెట్టుకున్న క‌ల‌బంద ముక్క‌లు, నాలుగు మందారం పువ్వులు వేసుకుని మెత్త‌గా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్ర‌మంలో నాలుగు టేబుల్ స్పూన్ల టీ డికాక్ష‌న్‌, నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యం నీరు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆముదం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!

ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి ష‌వ‌ర్ క్యాప్‌ను ధ‌రించాలి.గంట అనంత‌రం మైల్డ్ షాంపూను యూస్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.ఈ విధంగా వారంలో ఒక్క‌సారి చేశారంటే జుట్టు రాల‌డం త‌గ్గి ఒత్తుగా పెరుగుతుంది.

Advertisement

డాండ్ర‌ఫ్ స‌మ‌స్య దూరం అవుతుంది.మ‌రియు వైట్ హెయిర్ త్వ‌ర‌గా రాకుండా కూడా ఉంటుంది.

తాజా వార్తలు