చుండ్రుతో బాగా విసిగిపోయారా? ఈ ఆయిల్ ను వాడితే వారం రోజుల్లో మాయమవుతుంది!

చుండ్రు.అత్యంత సాధారణంగా వేధించే సమస్యల్లో ఒకటి.స్త్రీలే కాదు పురుషులు కూడా చుండ్రుతో సతమతం అవుతుంటారు.

వాతావరణంలో వచ్చే మార్పులు, ఆహారపు అలవాట్లు, కాలుష్యం, డెడ్ స్కిన్ సెల్స్ పేరుకుపోవడం తదితర కారణాల వల్ల చుండ్రు ఇబ్బంది పెడుతూ ఉంటుంది.పైగా ఒక్కోసారి ఎన్ని చిట్కాలు ప్రయత్నించిన, ఖరీదైన షాంపూను ఉపయోగించిన ఫలితం ఉండదు.

దీంతో చుండ్రుతో బాగా విసిగిపోతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే చింతించకండి.ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే పవర్ ఫుల్‌ ఆయిల్ ను కనుక వాడితే వారం రోజుల్లోనే చుండ్రు మాయమవుతుంది.

మరి ఇంకెందుకు లేటు ఆ ఆయిల్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో రెండు కప్పుల వేపాకు, నాలుగు రెబ్బ‌ల‌ కరివేపాకు వేసుకుని రెండు మూడు నిమిషాల పాటు వేయించాలి.

Advertisement

ఇలా వేయించిన కరివేపాకు వేపాకును మిక్సీ జార్ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ కొబ్బరి నూనె వేసుకోవాలి.

ఆపై గ్రైండ్ చేసి పెట్టుకున్న వేపాకు కరివేపాకు పొడి వేసుకోవాలి.

అలాగే ఐదు నుంచి ఎనిమిది లవంగాలు, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకుని చిన్న మంటపై కనీసం ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు ఉడికించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి స్టైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత స్కాల్ప్ కు అప్లై చేసుకుని బాగా మసాజ్ చేసుకోవాలి.

నైట్ నిద్రించే ముందు ఈ ఆయిల్ ను అప్లై చేసుకుని మ‌రుస‌టి రోజు మైల్డ్‌ షాంపూతో తలస్నానం చేయాలి.మూడు రోజులకు ఒకసారి ఈ ఆయిల్ ను వాడాలి.తద్వారా వారం రోజుల్లోనే చుండ్రు మొత్తం మాయం అవుతుంది.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

తరచూ ఈ ఆయిల్ ని యూస్ చేస్తే మళ్లీ మళ్లీ చుండ్రు దరిదాపుల్లోకి రాకుండా ఉంటుంది.స్కాల్ప్ శుభ్రంగా మరియు ఆరోగ్యంగా మారుతుంది.

Advertisement

ఇన్ఫెక్షన్, దురద వంటి సమస్యలు ఉన్న దూరం అవుతాయి.

తాజా వార్తలు