చర్మాన్ని అద్దంలా మెరిపించే మ్యాజికల్ టోనర్ ఇది.. తప్పకుండా ట్రై చేయండి!

చర్మం అద్దంలా మెరిసిపోవాలని కోరుకోని వారు ఉండరు.ముఖ్యంగా మగువలు అటువంటి చర్మం కోసం మరింత ఎక్కువగా ఆరాటపడుతుంటారు.

ఈ నేపథ్యంలోనే చర్మం కోసం మార్కెట్లో లభ్యమయ్యే ఖరీదైన ఉత్పత్తుల‌ను కొనుగోలు చేసి వాడుతుంటారు.కానీ మార్కెట్లో లభ్యం అయ్యే ఉత్పత్తుల్లో ఎన్నో రకాల కెమికల్స్‌ నిండి ఉంటాయి.

అవి తాత్కాలికంగా చర్మాన్ని అందంగా మార్చినా.భవిష్యత్తులో అనేక సమస్యలను తెచ్చిపెడతాయి.

అందుకే సహజంగానే అందంగా మెరవడానికి ప్రయత్నించాలి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే హోమ్ మేడ్‌ మ్యాజికల్ టోనర్ ను వాడితే న్యాచురల్ గానే చర్మాన్ని అద్దంలా మెరిపించుకోవచ్చు.

Advertisement

మ‌రి ఇంకెందుకు ఆలస్యం ఆ మ్యాజికల్ టోన‌ర్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా స్ట‌వ్ ఆన్‌ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్‌ వాటర్ పోయాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో గుప్పెడు ఫ్రెష్ పుదీనా ఆకులు వేసుకోవాలి.

అలాగే రెండు లేదా మూడు జ్యూస్ తొలగించిన నిమ్మ తొక్కలను వేసి వాటర్ సగం అయ్యేంత వరకు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ హాఫ్ చేసి మరిగించిన వాటర్ ను స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ ను చల్లారపెట్టుకోవాలి.

పూర్తిగా కూల్ అయిన అనంతరం ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్లు బియ్యం కడిగిన వాటర్ ను వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మన మ్యాజికల్ టోనర్ సిద్ధమవుతుంది.

Dandruff Homemade Serum : ఈ హోమ్‌ మేడ్ సీర‌మ్ ను వాడితే డాండ్రఫ్ అన్న మాటే అన‌రు!

ఈ టోనర్ ను ఒక స్ప్రే బాటిల్ లో నింపుకోవాలి.ముఖానికి ఉదయం, సాయంత్రం ఈ టోనర్ ను స్ప్రే చేసుకోవాలి.రోజుకు రెండు సార్లు కనుక ఈ టోనర్ ను వాడితే చర్మం అద్దంలా షైనీ గా మెరిసిపోతుంది.

Advertisement

డల్ నెస్ పోయి ముఖ చర్మం యాక్టివ్‌గా, ఎట్రాక్టివ్ గా మారుతుంది.అంతేకాదు ఈ మ్యాజికల్ టోనర్ ను కనుక వాడితే వృద్ధాప్య ఛాయ‌లు త్వరగా దరిచేరకుండా ఉంటాయి.

అధిక జుట్టు తొలగిపోయి చర్మం ఫ్రెష్ గా సైతం మారుతుంది.

తాజా వార్తలు