పాదాలు నల్లగా అసహ్యంగా మారాయా.. పసుపుతో ఇలా చేశారంటే పది నిమిషాల్లో వైట్ గా మారతాయి!

బయటకు బహిర్గతం అయ్యే మన శరీర భాగాల్లో పాదాలు ఒకటి.అందువల్ల పాదాలు( feet ) తెల్లగా మృదువుగా మెరిసిపోతూ కనిపించాలని మగువలు ఆరాటపడుతుంటారు.

కానీ ప్రస్తుత వేసవి కాలంలో ఎండలు, అధిక వేడి కారణంగా పాదాలు టాన్ అయిపోతాయి.నల్లగా అసహ్యంగా మారతాయి.

దాంతో నల్లగా మారిన పాదాలను చూసి వర్రీ అయిపోతుంటారు.పాదాలను మళ్లీ ఎలా తెల్లగా మార్చుకోవాలో తెలియక సతమతం అవుతుంటారు.

మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే రెమెడీ మీకు చాలా బాగా సహాయపడుతుంది.ఈ రెమెడీని పాటిస్తే పైసా ఖర్చు లేకుండా పాదాలను తెల్లగా మెరిపించుకోవచ్చు.

Advertisement

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.నిత్యం వంటల్లో విరివిరిగా వాడే మ‌సాలాల్లో ప‌సుపు ముందు వ‌రుస‌లో ఉంటుంది.

పసుపు ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.అలాగే చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడానికి పసుపు ఉపయోగపడుతుంది.

న‌ల్ల‌గా మారిన పాదాల‌ను రిపేర్ చేయ‌డానికి కూడా ప‌సుపు తోడ్ప‌డుతుంది.

అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు పసుపు( Turmaric ) వేసి పూర్తిగా నల్లగా మారేంతవరకు వేయించుకోవాలి.ఇప్పుడు ఈ పసుపులో వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ), రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం( lemon juice ) వేసుకుని కలుపుకోవాలి.చివరిగా మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు పచ్చి పాలు వేసుకొని అన్నీ కలిసేలా మరోసారి మిక్స్ చేసుకోవాలి.

శ్రీ కృష్ణ పరమాత్ముడికి ఎంత మంది సంతానమో తెలుసా?

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పాదాలకు పూతలా అప్లై చేసుకుని 10 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై అర నిమ్మ చెక్కను తీసుకుని పాదాలను బాగా రుద్దుకోవాలి.

Advertisement

ఫైనల్ గా గోరు వెచ్చని నీటితో పాదాలను వాష్ చేసుకుని తడిలేకుండా తుడిచి మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీని పాటించడం వల్ల పాదాలపై పేరుకుపోయిన మురికి మృతకణాలు తొలగిపోతాయి.టాన్ రిమూవ్ అవుతుంది.

నల్లగా అసహ్యంగా మారిన పాదాలు వైట్ గా మరియు స్మూత్ గా మారతాయి.అందంగా మెరుస్తాయి.

కాబట్టి పాదాలు నల్లగా మారాయని బాధపడుతున్న వారు తప్పకుండా పసుపుతో ఇప్పుడు చెప్పుకున్న రెమెడీని ప్రయత్నించండి.మంచి రిజల్ట్‌ మీ సొంతం అవుతుంది.

తాజా వార్తలు