జుట్టు ఒత్తుగా మారాలా.. చుండ్రు పోవాలా.. అయితే ఈ రెమెడీ మీకోసమే..!

మనలో చాలా మందికి అధిక హెయిర్ ఫాల్ కారణంగా జుట్టు అనేది పల్చగా మారిపోతూ ఉంటుంది.మహిళల్లో డెలివరీ తర్వాత ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.

అలాగే పల్చటి జుట్టు తో బాధపడుతున్న పురుషులు కూడా ఎందరో ఉన్నారు.అయితే అలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే రెమెడీ చాలా ఉత్తమంగా సహాయపడుతుంది.

ఈ రెమెడీ ని ఫాలో అయితే జుట్టు ఒత్తుగా మారడమే కాకుండా మరెన్నో ప్రయోజనాలు కూడా పొందుతారు.మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ రెమెడీ ఏంటో ఓ చూపు చూసేయండి.

This Home Remedy Helps To Get Thick Hair Home Remedy, Thick Hair, Hair Care, Ha

అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flaxseeds ) వేసుకోవాలి.ఆ త‌ర్వాత ఒక చిన్న కప్పు బియ్యం వండిన తర్వాత వచ్చే గంజిని పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.మరుసటి రోజు మిక్సీ జార్ తీసుకొని అందులో నానబెట్టుకున్న అవిసె గింజలను గంజితో పాటుగా వేసుకోవాలి.

Advertisement
This Home Remedy Helps To Get Thick Hair! Home Remedy, Thick Hair, Hair Care, Ha

అలాగే చేతి నిండా మునగాకు తీసుకుని మిక్సీ జార్ లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

This Home Remedy Helps To Get Thick Hair Home Remedy, Thick Hair, Hair Care, Ha

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే మీ హెయిర్ గ్రోత్ ( Hair growth ) రెండింతలు పెరుగుతుంది.

పల్చగా ఉన్న మీ కురులు క్రమంగా ఒత్తుగా మారతాయి.అలాగే ఈ రెమెడీని ఫాలో అవ్వడం వల్ల చుండ్రు సమస్య దూరం అవుతుంది.స్కాల్ప్ హైడ్రేట్ గా మరియు హెల్తీ గా మారుతుంది.

అదే స‌మ‌యంలో అవిసె గింజులు, అన్నం గంజి మ‌రియు మున‌గాకు జుట్టు రాలడాన్ని అడ్డుకుంటాయి.జుట్టును ఆరోగ్యంగా దృఢంగా మారుస్తాయి.

విజిల్ పోడు.. పుష్ప ఎంట్రీతో అదరగొట్టిన జడ్డు భాయ్!
ఎన్టీయార్ ప్రశాంత్ నీల్ సినిమా కోసం భారీగా కష్టపడుతున్నాడా..?

సిల్కీ అండ్ షైనీ హెయిర్ ను కోరుకునే వారికి కూడా ఈ రెమెడీ ఎంత ఉత్తమంగా సహాయపడుతుంది.

Advertisement

తాజా వార్తలు