తల దురదతో విసిగిపోయారా? డోంట్ వ‌ర్రీ.. ఈ రెమెడీని ట్రై చేయండి!

ప్రస్తుత వర్షాకాలంలో ప్రధానంగా వేధించే సమస్యల్లో తల దురద ఒక‌టి.

వర్షంలో తరచూ తడవటం, చుండ్రు, హెయిర్ ఆయిల్ ను ఎవైడ్‌ చేయడం, అలర్జీ, ఇన్ఫెక్షన్స్, పేలు, రెగ్యులర్ గా షాంపూ చేసుకోవడం తదితర కారణాల వల్ల తలలో విపరీతమైన దురద పెడుతూ ఉంటుంది.

ఈ దురద వల్ల ఏ పని పైన శ్రద్ధ పెట్టలేకపోతుంటారు.మీరు కూడా తల దురదతో విసిగిపోయారా? అయితే డోంట్ వర్రీ.ఎందుకంటే, ఇప్పుడు చెప్ప‌బోయే ప‌వ‌ర్ ఫుల్ హోం రెమెడీని ట్రై చేశారంటే చాలా సులభంగా తల దురదను వదిలించుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ హోం రెమెడీ ఏంటో.దాన్ని ఎలా సిద్ధం చేస‌సుకోవాలో.తెలుసుకుందాం పదండి.

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెపెట్టుకుని గ్లాస్ వాటర్ ను పోయాలి.వాటర్ హీట్‌ అవ్వగానే అందులో వ‌న్ టేబుల్ స్పూన్ మెంతులు, వ‌న్‌ టేబుల్ స్పూన్ ఎండిన ఉసిరికాయ ముక్కలు వేసుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు బాగా మరిగించాలి.

Advertisement

ఇలా మరిగించిన వాటర్ ను స్ట్రైన‌ర్ సాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.ఆ త‌ర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ల గోరింటాకు పొడి, వన్ టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, వ‌న్‌ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని కలుపుకోవాలి.

ఆపై మొద‌ట త‌యారు చేసి పెట్టుకున్న‌ వాటర్ ను స‌రిప‌డా వేసుకొని అన్ని కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు మాత్రమే కాకుండా జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ను ధరించాలి.

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూను యూజ్‌ చేసి శుభ్రంగా హెయిర్ వాష్ చేసుకోవాలి.వారంలో రెండు సార్లు ఈ రెమెడీని ఫాలో అయ్యారంటే త‌ల దుర‌ద‌ అన్న మాటే అన‌రు.పైగా ఈ రెమెడీని పాటించడం వల్ల హెయిర్ ఫాల్, డ్యాండ్ర‌ఫ్‌, ఆయిలీ హెయిర్ వంటి సమస్యలు సైతం దూరం అవుతాయి.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు