చలికాలంలో( winter ) వచ్చే కొన్ని మార్పుల కారణంగా చాలా మంది అధిక హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతూ ఉంటారు.
ఎంతో ఇష్టంగా పెంచుకున్న జుట్టు రోజూ ఊడిపోతుంటే చూసి సహించలేకపోతుంటారు.
జుట్టు రాలడాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ఆరాటపడుతుంటారు.మీరు ఈ జాబితాలో ఉన్నారా.? అయితే ఇప్పుడు చెప్పబోయే సింపుల్ రెమెడీ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.ఈ రెమెడీని కనుక పాటిస్తే మీ జుట్టు ఊడమన్న ఊడదు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు శనగపిండి( Besan flour ) వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ బాదం పౌడర్( Almond powder ), వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్( Coconut oil ) వేసుకుని రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలి.చివరిగా ఒక ఎగ్ వైట్ ను కూడా వేసి మరోసారి కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.
ముప్పై నిమిషాల అనంతరం తేలికపాటి షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్ ( Hair mask )ను కనుక వేసుకుంటే అదిరిపోయే బెనిఫిట్స్ మీ సొంతమవుతాయి.ముఖ్యంగా ఈ మాస్క్ జుట్టు రాలడాన్ని చాలా వేగంగా మరియు సమర్థవంతంగా అరికడుతుంది.
హెయిర్ రూట్స్ ను సూపర్ స్ట్రాంగ్ గా మారుస్తుంది.అలాగే ఈ మాస్క్ ద్వారా మీ జుట్టుకు విటమిన్ ఎ, విటమిన్ ఇ మరియు విటమిన్ బి అందుతాయి.
ఇవి జుట్టు వేగంగా మరియు బలంగా పెరగడానికి సహాయపడతాయి.
గుడ్డు, బాదం లో ఉండే ప్రోటీన్లు మరియు ఫ్యాట్స్ హెయిర్ అండ్ స్కాల్ప్ ను తేమగా ఉంచుతాయి.పొడి బారకుండా రక్షిస్తాయి.అంతేకాకుండా వారానికి ఒకసారి ఈ మాస్క్ ను వేసుకోవడం వల్ల హెయిర్ షైనీ గా మారుతుంది.
జుట్టు విరగడం, చిట్లడం వంటి సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy