ఇకపై సింగిల్ బాయ్స్‌కి చింతక్కర్లేదు.. నచ్చిన గర్ల్‌ఫ్రెండ్‌ను అందించనున్న ఏఐ కంపెనీ!

నచ్చిన గర్ల్‌ఫ్రెండ్‌ లేదా లైఫ్ పార్ట్‌నర్ కనుగొనడం కొన్నిసార్లు ఎంత కష్టమో సింగిల్ బాయ్స్‌కే తెలుసని చెప్పవచ్చు.

ఒక్క లవర్ కూడా దొరకక సింగిల్ బాయ్స్( Single Boys ) ఎంతో బాధ పడిపోతుంటారు.

అయితే వారి బాధలకు త్వరలోనే చెక్ పడే అవకాశం ఉందని తెలుస్తోంది.కంప్యూటర్‌ని ఉపయోగించి గర్ల్‌ఫ్రెండ్‌ను( Girlfriend ) నచ్చినట్టు క్రియేట్ చేసుకోవడంలో సహాయపడే ఓ AI టెక్నాలజీ తాజాగా అందుబాటులోకి రావడానికి సిద్ధమైంది.

ఇది గేమ్ కోసం ఒక పాత్రను తయారు చేయడం లాంటిది, కానీ ఈ గర్ల్‌ఫ్రెండ్‌ మీతో నిజమైన వ్యక్తిలా మాట్లాడుతుంది.

This Ai Tool Will Let You Create Your Own Girlfriend Details, Ai Girlfriend, Sil

సిలికాన్ వ్యాలీలోని ఆండ్రీసెన్ హోరోవిట్జ్( Andreessen Horowitz ) అనే ఓ సంస్థ కథ, వ్యక్తిత్వాన్ని అందించడం ద్వారా సొంత AI గర్ల్‌ఫ్రెండ్‌ని డిజైన్ చేయగల ప్రాజెక్ట్‌ను రూపొందించింది.ఈ కంపెనీ కొన్ని నేపథ్యాలలో గర్ల్‌ఫ్రెండ్‌ లేదా పార్ట్‌నర్‌ను ప్రీ-డిజైన్ చేసి వెంటనే ఎంచుకోవడానికి సిద్ధంగా ఉంచారు.టెస్టింగ్ ఫేజ్‌ పూర్తయ్యాక త్వరలోనే టెక్నాలజీ సామాన్య ప్రజలకు అందుబాటులోకి రానుంది.

Advertisement
This AI Tool Will Let You Create Your Own Girlfriend Details, AI Girlfriend, Sil

కొంతమంది వ్యక్తులు AI గర్ల్‌ఫ్రెండ్‌( AI Girlfriend ) అందుబాటులోకి వస్తుందని తెలిసి చాలా ఎగ్జైట్ అవుతున్నారు.ఎందుకంటే వారితో మాట్లాడటం నిజమైన అమ్మాయితో మాట్లాడినంత సరదాగా అనిపించవచ్చు.

This Ai Tool Will Let You Create Your Own Girlfriend Details, Ai Girlfriend, Sil

అయినా మనుషులుగా ఒక విషయం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.అదేంటంటే, నిజమైన వ్యక్తులతో నిజమైన స్నేహాలు, సంబంధాలు చాలా ముఖ్యమైనవి.మరింత అర్థవంతమైనవి.

AI మెరుగుపడుతోంది, కానీ ఇది ఇప్పటికీ నిజమైన మానవ కనెక్షన్‌లను భర్తీ చేయలేదు.ఇకపోతే ఇంతకుముందు శృంగార కోరికలను తీర్చే భాగస్వాములను ఒక ఏఐ కంపెనీ ఆఫర్ చేసింది కానీ ఆ తర్వాత వాటిని నిలిపివేసింది.

అయితే వీటిని యాక్సెస్ చేయడానికి చాలా డబ్బులు చెల్లించాల్సి వస్తోంది.

Red Eyes : కళ్లు ఎర్రగా ఉండడం ఏ వ్యాధి లక్షణమో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు