గురువారం రోజు మహిళలు అస్సలు చేయకూడని పనులు.. చేస్తే మాత్రం..

సాధారణంగా గురువారం రోజు కొన్ని పనులు చేయడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు.

కొన్ని ముఖ్యమైన కార్యాలు లేదా ఏవైనా పని మొదటి సారి గనుక మొదలు పెడుతున్నట్లయితే గురువారం రోజు వద్దు అని పెద్దవారు చెబుతూ ఉంటారు.అయితే అసలు గురువారం రోజున ఈ పనులు ఎందుకు చేయకూడదు అలా చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే గురువారం రోజు అనేది మన జీవిత అనుభవాన్ని ప్రభావితం చేసే విష్ణు ప్రతిమ ఆయన గురు బృహస్పతికి అంకితం చేయబడింది.

అయితే మన హిందూ మతంలో ప్రతి రోజుకు ఒక సొంత ప్రాముఖ్యత ఉంది.అందువల్ల కొన్ని నిర్దిష్ట రోజులలో చేయకూడని పనులు, చేయవలసిన పనుల గురించి పండితులు తెలియజేశారు.అందులో భాగంగా గురువారం చేయకూడని పనులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే గురువారం రోజు మహిళలు తల స్నానం చేయకూడదని చాలా మంది ప్రజలు నమ్ముతారు.ఎందుకంటే గురువారం బృహస్పతి ప్రభువు రోజుగా పరిగణిస్తారు.అతను భర్త ప్రతిబింబాన్ని కూడా ప్రతిబింబిస్తాడు.

అందువల్ల గురువారం తల స్నానం చేయడం వలన పిల్లలకు, భర్తకు దురదృష్టం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.అంతే కాకుండా సంపద కోల్పోయే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు.

కుటుంబ సభ్యులు అంతా ఆర్థిక సమస్యలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

ఇంకా చెప్పాలంటే గురువారం రోజు ఇంటిని శుభ్రం చేయడం మంచిది కాదని పెద్దవారు చెబుతూ ఉంటారు.అంతే కాకుండా ముఖ్యమైన శుభకార్యాలు లేదా తొలి సారిగా చేసుకునే మంచి కార్యక్రమాలు గురువారం చేయకూడదని అలా చేస్తే దురదృష్టాన్ని స్వాగతించినట్లు అవుతుందని చాలా మంది పెద్ద వారు నమ్ముతారు.కాబట్టి గురువారం రోజు ఇలాంటి పనులను చేయకూడదని పెద్దవారు చెబుతూ ఉంటారు.

తాజా వార్తలు