గుడ్డిదని గేలి చేశారు.. కట్ చేస్తే అంబానీతో సెల్ఫీ, మోదీతో భేటీ..!

ఆమె పేరు రక్షిత రాజు(Rakshitha Raju).వయస్సు 24 ఏళ్లే అయినా, సాధించిన విజయాలు మాత్రం ఎన్నో.

పారా-అథ్లెట్‌గా (para-athlete)తన ప్రయాణంలో 2018, 2023 ఆసియా క్రీడల్లో బంగారు పతకాలు(Gold medals at the Asian Games) కొల్లగొట్టింది.అంతేకాదు, పారిస్ పారాలింపిక్స్‌లోనూ సత్తా చాటింది.

BBCకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలోని ఒడుదుడుకులు, అంధురాలిగా క్రీడల్లో ఎదుర్కొన్న సవాళ్లు, తన గైడ్ రన్నర్‌తో ఉన్న అనుబంధం గురించి మనసు విప్పి మాట్లాడింది.దక్షిణ భారతదేశంలోని ఓ మారుమూల పల్లెటూరులో పుట్టి పెరిగింది రక్షిత.

పదేళ్ల వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయింది.వినికిడి, మాటలు సరిగ్గా రాని అమ్మమ్మ దగ్గరే అన్నీ తానై పెరిగింది.

Advertisement

ఊళ్లో వాళ్లంతా ఆమెను చూసి ‘గుడ్డిది, దేనికీ పనికిరాదు’ అని నిరుత్సాహపరిచేవారు.కానీ అమ్మమ్మ మాత్రం తనలాగే బాధలు తెలిసిన మనిషి కావడంతో రక్షితను వెన్నుతట్టి ప్రోత్సహించింది.

రక్షితలోని ప్రతిభను ఓ టీచర్ గుర్తించడంతో ఆమె జీవితం కొత్త మలుపు తిరిగింది.రన్నింగ్ చేయమని టీచర్(Teacher) ప్రోత్సహించగానే మొదట్లో రక్షితకు సందేహాలు."నేను గుడ్డిదాన్ని కదా, కళ్లు లేని నేను ట్రాక్‌పై ఎలా పరుగెత్తగలను?" అని తనలో తాను అనుకుంది.అప్పుడు టీచర్ అసలు విషయం చెప్పింది.

అంధులైన అథ్లెట్లు గైడ్ సహాయంతో పరుగెడతారని, ఇద్దరినీ కలిపేందుకు ఒక తాడు ఉంటుందని, ఆ గైడ్ నడిపిస్తాడని వివరించింది.ఈ కొత్త విషయం వినగానే రక్షిత లైఫ్ మారిపోయింది.

మొదట్లో క్లాస్‌మేట్స్ కొన్నాళ్లు గైడ్‌ రన్నర్లుగా సాయం చేశారు.కానీ 2016లో రాహుల్ బాలకృష్ణ అనే వ్యక్తి రక్షిత జీవితంలోకి వచ్చాడు.

వారంలో 3 సార్లు ఈ డ్రింక్ తాగితే.. మ‌ల్లెతీగ‌లా మార‌తారు!

రాహుల్ ఒకప్పుడు మిడిల్ డిస్టెన్స్ రన్నర్.గాయాల కారణంగా రన్నింగ్‌కు కాస్త దూరంగా ఉంటూ పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియాలో చేరాడు.

Advertisement

ఆ తర్వాత రక్షితకు కోచ్‌గా, ఫుల్‌టైమ్ గైడ్ రన్నర్‌గా మారాలని నిర్ణయించుకున్నాడు.

రాహుల్‌పై రక్షితకు చాలా నమ్మకం పెట్టుకుంది.అందుకే "నన్ను నేను ఎంత నమ్ముతానో అంతకంటే ఎక్కువగా నా గైడ్ రన్నర్‌ను నమ్ముతాను" అని అంటుంది.రక్షిత కేవలం పతకాలే కాదు, ఎంతోమంది అభిమానాన్ని, గుర్తింపును సంపాదించుకుంది.

తన ఇన్‌స్టాలో ప్రధాని మోదీ భేటీ అయిన ఫొటోలు, ముఖేష్ అంబానీతో లాంటి ప్రముఖులతో దిగిన ఫొటోలు షేర్ చేస్తూ ఉంటుంది.పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని రక్షిత ప్రూవ్ చేసింది.

తాజా వార్తలు