వైసిపి మూడో జాబితా రెడీ ! టికెట్ దక్కని వారి దారటే ?

రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వేలు చేయించి పార్టీ పరిస్థితి, ప్రజల్లో ఉన్న సానుకూలత, వ్యతిరేకత వంటి అన్ని అంశాల పైన ఒక అవగాహనకు వచ్చారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్.

( CM Jagan ) దానికి అనుగుణంగానే ఇప్పుడు పార్టీలో భారీ ప్రక్షాళనకు తెర తీశారు.

వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలనే పట్టుదలతో ఉన్న జగన్, దానికి అనుగుణంగానే కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు.ఇప్పటికే రెండు విడతలుగా నియోజకవర్గ ఇన్చార్జిలను( YSRCP Constituency Incharges ) ప్రకటించారు.

మొదటి విడతలో 11 మంది, రెండో విడతలో 38 మందిని ప్రకటించగా, మూడో జాబితా కూడా సిద్ధమైంది.సరైన సమయం చూసుకొని ఈ జాబితాను విడుదల చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.

టికెట్ దొరికే అవకాశం లేదనుకున్న వారిని నేరుగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి పిలిపించి జగన్ వారిని బుజ్జగించే  ప్రయత్నం చేస్తున్నారు.

These Ycp Leaders Likely Not Get Chance In Third List Of Ycp Constituency Inchar
Advertisement
These Ycp Leaders Likely Not Get Chance In Third List Of Ycp Constituency Inchar

వచ్చే ఎన్నికల్లో మహిళలు ,యువతకు ,అలాగే ఎస్సీ ,ఎస్టీ ,బీసీ మైనారిటీలకు ఎక్కువ ప్రాధాన్యం కల్పించే విధంగా జగన్ ముందుకు వెళ్తున్నారు.మూడో విడత( Third List ) జాబితాలో 25 మంది నియోజకవర్గ ఇన్చార్జిల పేర్లను జగన్ ప్రకటించనున్నారు.ఆ జాబితాను ఈ రోజే విడుదల చేయనున్నట్లు వైసిపిలోని( YCP ) కీలకవర్గాల ద్వారా తెలుస్తోంది.

అనంతపురం ,శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కర్నూలు ,నంద్యాల , ప్రకాశం, బాపట్ల, పలనాడు జిల్లాలోని నియోజకవర్గాలకు సంబంధించిన జాబితాను జగన్ ప్రకటించనున్నారు.అనంతపురం జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాపు రామచంద్ర రెడ్డికి( Kapu Ramachandra Reddy ) ఈసారి టికెట్ లభించడం లేదని ప్రచారం జరుగుతోంది.

దీంతో ఆయన వైసీపీకి రాజీనామా చేశారు.స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచనతో ఉన్నారు.దీంతో రాయదుర్గానికి ఎవరిని ఇన్చార్జిగా నియమిస్తారనేది ఈరోజు ప్రకటించే జాబితాలో తేలనుంది.

These Ycp Leaders Likely Not Get Chance In Third List Of Ycp Constituency Inchar

అదే విధంగా కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గం లో కూడా మార్పు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గుమ్మనూరు జయరాంకు( Gummanuru Jayaram ) ఈసారి టికెట్ దక్కే అవకాశం లేదని , కొత్త వారిని నియమించే ఆలోచనలో జగన్ ఉన్నారని ప్రచారం జరుగుతోంది.తనకు టికెట్ దక్కని పక్షంలో వైసిపిని వీడే ఆలోచనలు కూడా జయరాం ఉన్నట్లు సమాచారం .వైసీపీలో టిక్కెట్లు దక్కని చాలామంది కి కాంగ్రెస్ ఆప్షన్ గా కనిపిస్తోంది.త్వరలోనే ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న వైఎస్ షర్మిల సమక్షంలో వైసీపీకి చెందిన అసంతృప్త నాయకులు చేరబోతున్నట్లు సమాచారం.

నటుడిగా పనికిరాడు అని చెప్పిన రాజశేఖర్ తోనే 5 సినిమాలు చేసిన నిర్మాత ఎవరో తెలుసా?
Advertisement

తాజా వార్తలు