చివరి క్షణాల్లో ఇలా జరిగితే వారు స్వర్గానికి వెళ్తారట!

మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మరణించిన మన పూర్వీకులకు ఆత్మ శాంతి కోసం పిండ ప్రదానం చేస్తారు.

ఇలా చేయడం ద్వారా వారి ఆత్మకు శాంతి కలిగి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని మన నమ్మకం.

అయితే పిండ ప్రధానం ఎప్పుడైనా చేస్తూ ఉంటారు.కానీ పితృ పక్షం లో పిండ ప్రధానం చేయడం ద్వారా పితృదేవతలకు ఆత్మ శాంతి కలుగుతుంది.

Symptoms, Time Of Death, Heaven, After Death-చివరి క్షణాల�

అయితే సెప్టెంబర్ 2 నుండి పితృపక్షం ప్రారంభమైంది.ఈ పక్షం 15 రోజుల పాటు ఉంటుంది.

హిందూ ధర్మం ప్రకారం పితృపక్షం లో మరణించిన పూర్వీకులకు పిండ ప్రధానం చేయాలి.మనలోని బాహ్య లక్షణాలన్నీ పక్కకు పెట్టి పూర్వీకులపై పూర్తిగా మనస్సును లగ్నం చేసి వారి ఆత్మశాంతి కోసం ప్రార్థించాలి.

Advertisement

అయితే చివరి క్షణాల్లో కొన్ని ఆలోచనలను గుర్తుచేసుకొని స్వర్గం పొందుతారని నమ్ముతారు.చనిపోయిన తర్వాత స్వర్గ ప్రాప్తి కలగాలంటే వారు మరణించే సమయంలో తప్పనిసరిగా ఇవి పక్కన ఉండాలట.

అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.హిందూ సాంప్రదాయం ప్రకారం మనిషి మరణించే సమయంలో కొద్దిగా తులసి తీర్థం లేదా గంగాజలాన్ని నోట్లో పోస్తారు.

చాలా మందికి చనిపోయేముందు ఇవి అందుబాటులో లేకపోవడం వల్ల విఫలమవుతారు.అయితే చనిపోయే ముందు తులసి తీర్థాన్ని నోట్లోకి వేయడం ద్వారా అలాంటి వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.

ఎవరైనా చనిపోయినప్పుడు వారి ఆత్మ శరీరం ఎగువ భాగం నుండి బయటకు వెళ్తుంది.అంటే శరీరం ఎగువ భాగంలో కళ్ళు ముక్కు, నోరు, చెవులు ఉన్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

జీవితంలో మంచి పనులు చేసిన వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా కీర్తిప్రతిష్టలను పొందుతారు.అయితే మరణించిన సమయంలో వారి ఆత్మ ముక్కు ద్వారా బయటకు వెళితే వారి ముక్కు సొట్ట పోతుంది.

Advertisement

నోటి ద్వారా బయటకు వెళితే నోరు తెరుచుకుని ఉంటుంది.అదే కళ్ల ద్వారా బయటికి వెళ్లినప్పుడు కళ్ళు తెరుచుకుని ఉంటాయి.

చనిపోయిన వ్యక్తి ముఖంలో సంతోషం కనిపిస్తే వారు స్వర్గానికి వెళ్తారు.తప్పులు లేదా పాపాలు చేసి ఉంటే ఆ మనిషి మరణంలో భయం కనిపిస్తుంది.

అంటే అటువంటి వ్యక్తి నరకానికి వెళతారని అర్థం.

తాజా వార్తలు