ఆ హీరో తో నటించి స్టార్ హీరోయిన్లు అయ్యారు.. పాపం అతను మాత్రం? 

సాధారణంగా హీరోయిన్లకు ఇండస్ట్రీలో కాస్త తొందరగానే స్టార్ డమ్ వస్తూ ఉంటుంది.

కానీ హీరోలు మాత్రం స్టార్ హీరోలు గా మారి నిలదొక్కుకోవాలంటే చాలా కష్టపడాల్సిందే అని అంటూ ఉంటారు సినీ విశ్లేషకులు.

అచ్చంగా సీనియర్ హీరో చంద్రమోహన్ విషయంలో కూడా ఇలాగే జరిగింది.చంద్రమోహన్ తో కలిసి నటించిన ఎంతో మంది హీరోయిన్లు ఆ తర్వాత కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే అగ్ర తారలుగా వెలిగారు.

కానీ చంద్రమోహన్ మాత్రం ఎందుకో స్టార్ హీరో కాలేక పోయాడు అని చెప్పాలి.ఇలా చంద్రమోహన్ తో కలిసి నటించి ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా మారిన తారలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.1976లో కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సిరిసిరిమువ్వలు సినిమాలో నటించింది జయప్రద.ఈ సినిమాలో హీరో చంద్రమోహన్.ఈ సినిమా తర్వాత జాక్పాట్ కొట్టేసింది జయప్రద.

ఎన్టీఆర్ సరసన అడవి రాముడు, యమగోల సినిమాలకు అవకాశం దక్కించుకుంది.ఇక ఇలాగే 1978లో పదహారేళ్ళ వయసు సినిమా లో చంద్రమోహన్ కు శ్రీదేవి జంటగా నటించింది.

Advertisement
These Heroines Made By Chandra Mohan , Chandra Mohan , Stardom , Heroines ,

సినిమా మంచి విజయాన్ని సాధించింది.

These Heroines Made By Chandra Mohan , Chandra Mohan , Stardom , Heroines ,

ఆ తర్వాత శ్రీదేవి వేటగాడు, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి, ప్రేమాభిషేకం, బెబ్బులిపులి ఇలా చెప్పుకుంటూ పోతే స్టార్ హీరోలందరి సినిమాల్లో నటించింది.ఇక శ్రీదేవి ప్రస్థానం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.1978లో ప్రాణం ఖరీదు సినిమా లో చంద్రమోహన్ జయసుధ కలిసి నటించారు.తర్వాత ఎన్నో సినిమాలోని వీరిద్దరు జతకట్టారు.ఇక ఆ తర్వాత జయసుధ తిరుగులేని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.1983లో వచ్చిన పెళ్లి చూపులు సినిమాలో చంద్రమోహన్ విజయశాంతి కలిసి నటించారు.ఇక వీరి కాంబినేషన్లో వచ్చిన ప్రతి ఘటన కూడా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది.

ఆ తర్వాత విజయశాంతి మెగాస్టార్ నాగేశ్వరావు శోభన్ బాబు లాంటి స్టార్ హీరోలతో నటించింది.కానీ చంద్రమోహన్ మాత్రం స్టార్ హీరో అవ్వ లేకపోయాడు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు