రెగ్యుల‌ర్‌గా ఈ డ్రై ఫ్రూట్స్ తింటే..రక్తహీనత ప‌రార్‌!

ప్ర‌స్తుత కాలంలో ర‌క్తహీన‌త (ఎనీమియా) తో బాధ ప‌డుతున్న వారి సంఖ్య భారీగా ఉందీ అన‌డంలో సందేహ‌మే లేదు.

ర‌క్తంలో ఎర్ర ర‌క్త క‌ణాల సంఖ్య త‌గ్గిపోవడం వ‌ల్ల ర‌క్త హీన‌త బారిన పడుతుంటారు.

ఫ‌లితంగా త‌ర‌చూ అల‌సి పోవ‌డం, అధిక నీర‌సం, తీవ్ర‌మైన త‌ల‌నొప్పి, ఆయాసం, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, క‌ళ్ళు తిర‌గ‌డం, ఏకాగ్ర‌త్త లోపించ‌డం, ఉన్న‌ట్టు ఉండి బ‌రువు త‌గ్గిపోవ‌డం ఇలా ఎన్నో స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డాల్సి వ‌స్తుంది.అయితే ఈ స‌మ‌స్య‌ల‌ను నివారించి ర‌క్త హీన‌త‌కు చెక్ పెట్ట‌డంలో కొన్ని కొన్ని డ్రై ఫ్రూట్స్ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.

మ‌రి అవేంటో ఓ లుక్కేసేయండి.ఎండు ఖర్జూరాలు ర‌క్త హీన‌త‌ను త‌గ్గించ‌డంలో ఎఫెక్టివ్‌గా ప‌ని చేస్తాయి.

రోజుకు మూడు చ‌ప్పున ఎండు ఖ‌ర్జూరాలు తీసుకుంటే శ‌రీరానికి ఇత‌ర పోష‌కాల‌తో పాటు బోలెడంత ఐర‌న్ ల‌భిస్తుంది.కాబ‌ట్టి, రెగ్యుల‌ర్ డైట్‌లో ఎండు ఖ‌ర్జూరాలు ఉండేలా చూసుకోండి.

These Dry Fruits Helps To Reduce Anemia Dry Fruits, Anemia, Latest News, Blood,
Advertisement
These Dry Fruits Helps To Reduce Anemia! Dry Fruits, Anemia, Latest News, Blood,

వాల్ న‌ట్స్‌ వీటి ధ‌ర కాస్తే ఎక్కువే అయిన‌ప్ప‌టికీ ఎనీమియాను నివారించ‌డంలో స‌మ‌ర్ధ‌వంతంగా ప‌ని చేస్తాయి.ప్ర‌తి రోజు నాన‌బెట్టిన వాల్ న‌ట్స్‌ను నాలుగు చ‌ప్పున తీసుకుంటే వాటిలో ఉండే విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్‌, ఒమేగా -3 ఫాటీ యాసిడ్స్ ఇలా అనేక పోష‌కాలు శ‌రీరానికి అంది ఎర్ర ర‌క్త క‌ణాలు వృద్ధి చెందుతాయి.

These Dry Fruits Helps To Reduce Anemia Dry Fruits, Anemia, Latest News, Blood,

ర‌క్త హీన‌త‌కు చెక్ పెట్ట‌డంలో పిస్తా ప‌ప్పు కూడా హెల్ప్ చేస్తుంది.ప్ర‌తి రోజు కొన్ని పిస్తా ప‌ప్పులు తీసుకుంటే అందులో పుష్క‌లంగా ఉండే విట‌మిన్ బి హీమోగ్లోబిన్ కౌంట్ ను పెంచుతుంది.దాంతో ర‌క్త హీన‌త ప‌రార్ అవుతుంది.

ఎండు ద్రాక్షలో ఐర‌న్ పుష్క‌లంగా ఉంటుంది.కాబ‌ట్టి, వీటిని రెగ్యుల‌ర్ డైట్‌లో చేర్చుకుంటే.

ర‌క్త హీన‌త త‌గ్గు ముఖం ప‌డుతుంది.ఎండు ద్రాక్ష‌ల‌ను రాత్రంతా నీటిలో నాన బెట్టి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఉత‌యాన్నే తీసుకున్నా మంచి ఫ‌లితం ఉంటుంది.ఇక వీటితో పాటుగా జీడిప‌ప్పు, బాదం ప‌ప్పు కూడా ర‌క్త‌హీన‌త‌ను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి.

Advertisement
" autoplay>

తాజా వార్తలు