ప్రస్తుతం క్రికెట్లో ఏ ఫార్మాట్లోనైనా బ్యాటర్లు అద్భుతంగా రాణిస్తూ ఉండడంతో బౌలర్లు ఎంతో కష్టపడాల్సి వస్తోంది.
కొంతమంది అంతర్జాతీయ బ్యాటర్లు బౌలర్లను లక్ష్యంగా చేసుకొని మైదానంలో పరుగుల వరద పారిస్తున్నారు.
ఇక వన్డే క్రికెట్లో( One Day Cricket ) అన్ని జట్లు దాదాపుగా 300 కి పైగా పరుగులు సులభంగా చేయగలుగుతున్నారు.ఈ క్రమంలో చాలామంది బౌలర్లు ఒకే ఒక ఓవర్ లో భారీగా పరుగులు సమర్పించుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.
అంతర్జాతీయ వన్డే క్రికెట్ మ్యాచ్ లో ఒక ఓవర్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లు ఎవరో చూద్దాం.దక్షిణాఫ్రికాకు చెందిన హెర్షెల్ గిబ్స్( Herschelle Gibbs ) ఒక ఓవర్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.2007 ప్రపంచ కప్ లో దక్షిణాఫ్రికా వర్సెస్ నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ బౌలర్ డాన్ వాన్ బంగే( Daan van Bunge ) వేసిన ఓవర్లో ఆరు బంతుల్లో వరుసగా 6 సిక్సర్లు కొట్టి మొత్తం 36 పరుగులు చేశాడు.యుఎస్ఏ కు చెందిన జస్కరన్ మల్హోత్రా( Jaskaran Malhotra ) 2021లో హెర్షెల్ గిబ్స్ రికార్డును సమం చేశాడు.
2021లో యూఎస్ఏ వర్సెస్ పాపువా న్యూ గినియా మధ్య జరిగిన మ్యాచ్లో బౌలర్ జి టోకా వేసిన ఓవర్లో 6 బంతులకు వరుసగా 6 సిక్సర్లు కొట్టి 36 పరుగులు రాబట్టాడు.శ్రీలంకకు చెందిన తిసార పెరీరా( Thisara Perera ) 2013లో జరిగిన శ్రీలంక వర్సెస్ దక్షిణాఫ్రికా మ్యాచ్లో ఆర్ జె పీటర్సన్ వేసిన ఓవర్లో ఆరు బంతులకు 35 పరుగులు చేశాడు.దక్షిణాఫ్రికాకు చెందిన ఏబీ డివిలియర్స్( AB de Villiers ) 2014-15 ప్రపంచ కప్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్లో హోల్డర్( Holder ) వేసిన ఓవర్లో 34 పరుగులు చేశాడు.
న్యూజిలాండ్ కు చెందిన జేమ్స్ నీషమ్( James Neesham ) 2018-19 లో శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్ లో తిసార పెరీరా వేసిన ఓవర్లో 6 బంతులకు 34 పరుగులు చేశాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy