గుండెపోటుకు ఈ చెడు అలవాట్లే ప్రధాన కారణాలు..

ఈ మధ్యకాలంలో చాలామంది ప్రజలు బిజీ లైఫ్ కారణంగా ఎన్నో రకాల అనారోగ్యకరమైన ఆహారపు అలవాటులను చేసుకుంటూ ఉన్నారు.

అందువల్ల ఈ బిజీ లైఫ్ లో జీవించే వారిలో చాలా రకాల ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి.

ఇందులో ముఖ్యమైనది గుండెపోటు.సాధారణంగా వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య ఉంటుంది.

కానీ కొన్ని సంవత్సరాలు నుంచి చిన్న వయసు వారికి కూడా గుండెపోటు సమస్య పెరిగిపోతోంది.ఈ మధ్య కాలంలో ప్రముఖ సెలబ్రెటీలు చాలామంది గుండెపోటుగా బారిన పడి మరణించారు.

ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, జీవన శైలి అందుకు ప్రధాన కారణం అని తెలుస్తుంది.

These Bad Habits Are The Main Causes Of Heart Attack ,bad Habits ,heart Attack
Advertisement
These Bad Habits Are The Main Causes Of Heart Attack ,bad Habits ,heart Attack

గుండెకు రక్త సరఫరా లో ఇబ్బంది కలిగితే గుండెపోటు సమస్య వచ్చే అవకాశం ఉంది.సాధారణంగా రక్తవాహికలో కొలెస్ట్రాల్ ఇతర వ్యర్ధాలు ఏమైనా పేరుకుపోయినప్పుడే రక్త సరఫరాలో ఆటంకం ఏర్పడుతుంది.ప్రతి రోజు తెలుసో తెలియకో మనం చేసే కొన్ని పొరపాట్ల వల్ల ఈ మప్పు పెరుగుతుంది.

ఈ పొరపాట్లను తగ్గించుకోవడం వల్ల గుండెపోటు సమస్యను రాకుండా చేసుకోవచ్చు.గుండెపోటుకు గల ప్రధాన కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

These Bad Habits Are The Main Causes Of Heart Attack ,bad Habits ,heart Attack

ఈ పోటీ ప్రపంచంలో చాలా మంది స్థూలకాయం సమస్యలను ఎదుర్కొంటున్నారు.అధిక బరువు ప్రధాన సమస్యగా మారిపోయింది.గుండె పోటుకు ఇదే ప్రధాన కారణం అందుకే ముఖ్యంగా గుండెపోటు ముప్పును తగ్గించుకోవాలనుకునేవారు అధిక బరువు ఉండకుండా చూసుకోవడం మంచిది.

ధూమపానం ఎక్కువగా ఒత్తిడికి లోనడం వల్ల గుండెపోటు మప్పు చాలా అధికంగా ఉంటుందని అధ్యయనాలలో తెలిసింది.ధూమపానం చేసేటప్పుడు ధమనుల్లో ప్లక్స్ ఏర్పడుతూ ఉంటాయి.దాని వల్ల ధమనులు సంకోచించి గుండెకు రక్త సరఫరా తగ్గిస్తాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్30, బుధవారం 2025

ఫలితంగా గుండెపోటు సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా అవుతుంది.అందువల్ల మద్యపానం, ధూమపానం చేయకుండా ఉంటే గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది అని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు