మధుమేహం ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన మూడు రకాల ఆకులు ఇవే!

మధుమేహం.దీనినే డయాబెటిస్( Diabetes ) లేదా చక్కెర వ్యాధి అని పిలుస్తారు.

ఇటీవల రోజుల్లో కనీసం ఇంటికి ఒకరైన మధుమేహం బాధితులు ఉంటున్నారు.మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం, ఒత్తిడి తదితర కారణాల వల్ల చాలా మంది మధుమేహం బారిన పడుతున్నారు.

శరీరంలో షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉంటే ఎన్నో సమస్యలు తలెత్తుతుంటాయి.నీరసం, బలహీనత మాత్రమే కాకుండా అవయవాల పనితీరు సైతం నెమ్మదిస్తుంది.

అందుకే షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవడం ఎంతో అవసరం.

Advertisement

అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే మూడు రకాల ఆకులు గ్రేట్ గా సహాయపడతాయి.మధుమేహం ఉన్నవారు ఈ మూడు రకాల ఆకులు తప్పక తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.మరి ఇంతకీ ఆ మూడు రకాల ఆకులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కరివేపాకు.( Curry leaves ) రక్తంలో చక్కెర స్థాయిల‌ను సహజంగా నియంత్రించడానికి అద్భుతంగా తోడ్పడుతుంది.ఫైబర్ పుష్కలంగా ఉండే కరివేపాకు ఇన్సులిన్ చర్యను పెంచుతుంది.

షుగర్ లెవల్స్ ను కంట్రోల్ లో ఉంచుతుంది.అందుకే మధుమేహం ఉన్నవారు నిత్యం కరివేపాకును తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

అలాగే మావిడాకులు కూడా మధుమేహం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటాయి.మూడు లేదా నాలుగు ఫ్రెష్ మామిడాకులు( Mango leaves ) వాటర్ లో వేసి పది నిమిషాలు మరిగించి తీసుకోవాలి.

కేంద్రం కీలక నిర్ణయం..బంగారం,వెండిపై సుంకాలు డబుల్
కొద్ది పాటి చ‌లికే వ‌ణికిపోతున్నారా? అయితే మీరివి తెలుసుకోవాల్సిందే!

మామిడాకుల్లో ఫైబర్, విటమిన్ సి, పెక్టిన్ వంటి పోషకాలు ఉంటాయి.ఇవి అధిక చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.

Advertisement

అదే సమయంలో కొలెస్ట్రాల్ ను సైతం క‌రిగిస్తాయి.

ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మెంతి ఆకు.రుచి పరంగా కొంచెం చేదుగా ఉన్నా కూడా మెంతి ఆకులో పోషకాలు మెండుగా ఉంటాయి.ముఖ్యంగా మధుమేహం ఉన్న వారికి మెంతి ఆకు( Fenugreek leaf ) ఒక వరం అని చెప్పుకోవచ్చు.

మధుమేహంతో బాధపడుతున్న వారు రెండు రోజులకు ఒకసారి మెంతి ఆకు తీసుకుంటే సహజంగానే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

తాజా వార్తలు