డబ్బును మీరు ఇలా లెక్కపెడుతున్నారా... అయితే పేదవారు కావడం ఖాయం..

డబ్బు ప్రతి ఒక్కరి జీవితాలలో ఒక భాగంగా మారిపోయింది.ఎందుకంటే మనుషులు సంతోషంగా జీవించాలంటే వారికి తగినంత డబ్బు అవసరం.

కానీ చాలామంది ఎంతో కష్టపడి పని చేసినా ఇంట్లో ఆర్థిక సమస్యలు మాత్రం పెరుగుతూనే ఉంటాయి.డబ్బు మన చేతిలోకి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది.

ఇలాంటి సమస్యలకు జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పరిష్కారాలు ఉన్నాయి.అయితే లక్ష్మీ దేవిని అసంతృప్తికి గురిచేస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

కానీ కొన్నిసార్లు మనకు తెలిసి తెలియకుండా కొన్ని తప్పులు చేసి లక్ష్మీదేవికి కోపం తెప్పిస్తూ ఉంటాం డబ్బులు లెక్కించేటప్పుడు కూడా మనం కొన్ని పొరపాట్లను చేస్తూ ఉంటాం.ఢిల్లీకి చెందిన ఆచార్య గురుమిత్ సింగ్ డబ్బును లెక్క పెట్టేటప్పుడు ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవడం ఎలానో చెప్పారు.

Advertisement
These Are The Things That Should Not Be Done Wiile Counting Money Details, Count

డబ్బును లెక్కపెట్టేటప్పుడు ఉమ్మి అంటిన చేతులతో ఆ డబ్బును లెక్కపెట్టకూడదు.డబ్బును లెక్క పెట్టేటప్పుడు కొంతమంది ప్రజలు బొటన వేలికి ఉమ్మి అంటించుకుని లెక్కపెడుతూ ఉంటారు.

ఇలా లెక్కపెట్టడం వల్ల ఆ వ్యక్తికి ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉంది.కరెన్సీ నోట్లపై ఉమ్మి అంటించడం ఆరోగ్యనికి కూడా మంచిది కాదు.

మీరు అంతగా బొటనవేలును తడి చేసుకోవాలంటే నీరు తీసుకోవడం మంచిది.

These Are The Things That Should Not Be Done Wiile Counting Money Details, Count

కొంతమంది ప్రజలు నాణేలను బొమ్మల లాగా విసిరేస్తుంటారు.అంటే వాటిని చేతికి ఇవ్వకుండా దూరం నుంచే విసిరేస్తుంటారు.ఇది కూడా మంచి పద్ధతి కాదు డబ్బు నోట్లు, నాణేలను పారేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది.

బూతు సినిమాలు మళ్లీ తెలుగు తెరను ఏలనున్నాయా?

అలాంటివారు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నిలబడి ఉండదు.డబ్బును ఎక్కడపడితే అక్కడ ఉంచే అలవాటు కొంతమంది ప్రజలలో ఉంటుంది.బయటికి వెళ్లి ఇంటికి వచ్చినప్పుడు ఎక్కడపడితే అక్కడ డబ్బును కొంతమంది ఉంచేస్తుంటారు.

Advertisement

అలా చేయడం వల్ల లక్ష్మీదేవిని అవమానించినట్లే అని కొంతమంది జ్యోతిష్య పండితులు చెబుతూ ఉంటారు.

తాజా వార్తలు