SUV నుంచి ఏకంగా నాలుగు సరికొత్త మోడల్స్ మార్కెట్ లోకి విడుదల అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.
SUV లను ఇష్టపడే వాహనదారులు త్వరలో విడుదల అయ్యే ఈ కార్ల ఫీచర్ల గురించి తెలిస్తే కొనకుండా ఉండలేరు.
ఎందుకంటే.ఎలక్ట్రిక్, షేర్డ్ ప్లాట్ ఫారం లు, క్లాసిక్ డిజైన్ అప్డేట్ లతో మార్కెట్లోకి రానున్నాయి.
ఆ SUV కార్లు ఏవో.వాటికి సంబంధించిన ఫీచర్లు ఏమిటో చూద్దాం.టయోటా టేజర్: ( Toyota Taser )టయోటా కిర్లోస్కర్ కు చెందిన ఈ కారు మారుతి సుజుకీ ఫ్రాంటెక్స్ కాంపాక్ట్ క్రాసోవర్ రీ-బ్యాడ్జ్ మోడల్.ఈ కారు ఫ్లాట్ ఫారమ్, పవర్ ట్రెయిన్, డిజైన్ అంశాలు అచ్చం బ్రోంక్స్ లక్షణాలనే కలిగి ఉంటాయి.
టేజర్ మారుతి ఇంజనీరింగ్, టయోటా సిగ్నేచర్ అంశాల కలయిక ఉంటుంది.ఈ సరికొత్త కారు రెండు ఇంజన్ల ఆప్షన్ లలో కూడా అందుబాటులో ఉంటుంది.ఈ కారు 100bhp పవర్ తో 1.0L బూస్టర్ జెట్ పెట్రోల్, 90bhp పవర్ తో 1.2L సహజంగా ఆశించిన పెట్రోల్ ఇంజన్ ఉన్నాయి.ధరతోపాటు మిగిలిన వివారాలు త్వరలోనే కంపెనీ వెల్లడించనుంది.
టాటా పంచ్ EV:( Tata Punch EV ) ఈ ఎలక్ట్రిక్ మైక్రో SUV బహుళ బ్యాటరీ ప్యాక్ లు, చార్జింగ్ ఎంపికలతో మార్కెట్లోకి వస్తుంది.Nexon EV లేదా Tiago EV పవర్ ట్రెయిన్ ఇందులో చూడవచ్చు.
ICE మోడల్ కు భిన్నంగా ఈ కారు డిజైన్ అంశాలు ఉంటాయి.ఈ కారును టాటా రెండవ జనరేషన్ EV అర్కిటెక్చర్ పై తయారు చేశారు.
మహీంద్రా బొలెరో నియో ప్లస్:( Mahindra Bolero Neo Plus ) ఈ కారు 2.2 లీటర్ డీజిల్ ఇంజన్ ను కలిగి ఉంది.120bhp శక్తిని అందిస్తుంది.6-speed మ్యానువల్ గేర్ బాక్స్ తో జతచేయబడింది.ఈ కారులో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, బ్లూటూత్ కనెక్టివిటీ తో కూడిన 2-DIN ఆడియో సిస్టం నాతో పాటు డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, క్రూయిజ్ కంట్రోల్ తో సహా ఇతర ఫీచర్లతో ఉంటుంది.
కియా సోనెట్ ఫేస్ లిఫ్ట్:( Kia Sonet Facelift ) కియా మోటార్స్ ఈ కారులో పెద్దగా మార్పులు ఏమి చేయలేదు.సొనెట్ దాని ప్రస్తుత పవర్ ట్రెయిన్ ఎంపికలతో మాత్రమే వస్తుంది.ఈ కారు చూడడానికి చాలా స్టైలిష్ గా కనపడుతుంది.2023 కియా సోనే ఫేస్ లిఫ్ట్ అప్డేట్ చేయబడిన బంపర్, LED,DRL లు, ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు, ఫాగ్ ల్యాంప్ లను కలిగి ఉంటుంది.కార్ లోపల కొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, అప్ హోల్ స్టరీ లతో ఉంటుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy