డార్క్ సర్కిల్స్ ను పోగొట్టే మోస్ట్ ఎఫెక్టివ్ టిప్స్ ఇవే!

డార్క్ సర్కిల్స్.( Dark Circles ) మనలో ఎంతో మందిని కలవరపెట్టే సమస్య ఇది.

మగవారితో పోలిస్తే ఆడవారిలో డార్క్ సర్కిల్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి.డార్క్ సర్కిల్స్ తలెత్తడానికి అనేక కారణాలు ఉన్నాయి.

అలాగే వాటిని తగ్గించుకోవడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే డార్క్ సర్కిల్స్ ను పోగొట్టే మోస్ట్ ఎఫెక్టివ్ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు అలోవెరా జెల్,( Aloevera Gel ) రెండు టేబుల్ స్పూన్లు పొటాటో జ్యూస్,( Potato Juice ) రెండు టేబుల్ స్పూన్లు కీర దోసకాయ జ్యూస్,( Cucumber Juice ) రెండు చుక్కలు విటమిన్ ఈ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.తద్వారా ఒక క్రీమ్ సిద్ధమవుతుంది.

Advertisement
These Are The Most Effective Tips To Get Rid Of Dark Circles Details, Dark Circ

ఈ క్రీమ్ ను ఒక బాక్స్ లో నింపుకొని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి.రోజు ఉదయం స్నానం చేయడానికి గంట ముందు మరియు నైట్ నిద్రించడానికి ముందు తయారు చేసుకున్న క్రీమ్ ను కళ్ల చుట్టూ అప్లై చేసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.

రెగ్యులర్గా ఇలా చేస్తే వారం రోజుల్లోనే డార్క్ సర్కిల్స్ తగ్గుముఖం పడతాయి.

These Are The Most Effective Tips To Get Rid Of Dark Circles Details, Dark Circ

అలాగే టమాటో కూడా కళ్ళ చుట్టూ ఏర్పడిన నల్లటి వలయాలను దూరం చేయ‌గ‌ల‌దు.రెండు టేబుల్ స్పూన్లు టమాటో ప్యూరీలో వన్ టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు విశ్రాంతి తీసుకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.రోజుకు ఒకసారి ఈ సింపుల్ టిప్ ను కనుక పాటిస్తే డార్క్ సర్కిల్స్ కు బై బై చెప్ప‌వ‌చ్చు.

These Are The Most Effective Tips To Get Rid Of Dark Circles Details, Dark Circ
వినాయకుడి శరీరం ఇన్నింటికి సంకేతమా?

ఇక ఇవేమీ మేము చేయలేము.మాకు అంత టైం ఉండదు అనుకునే వారికి బాదం ఆయిల్ బెస్ట్ ఆప్షన్.రోజు నైట్ నిద్రించే ముందు ఏమైనా మేకప్ ఉంటే తొలగించి వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోవాలి.

Advertisement

అనంత‌రం క‌ళ్ళ చుట్టూ బాదం ఆయిల్ ను అప్లై చేసుకుని ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకుని పడుకోవాలి.నిత్యం ఇలా చేసిన కూడా నల్లటి వలయాలు తగ్గు ముఖం పడతాయి.

తాజా వార్తలు