ఈ ల‌క్ష‌ణాలు మీలో క‌నిపిస్తే.. డ‌యాబెటిస్ ఉన్న‌ట్టే?

మ‌ధుమేహం లేదా డ‌యాబెటిస్‌.ప్ర‌పంచ‌వ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని వేధిస్తున్న స‌మ‌స్య ఇది.

ఒక్కసారి మ‌ధుమేహం వ‌చ్చిందంటే.జీవిత‌కాలం ఉంటుంది.

జీవిత‌కాలం మందులు తీసుకోవాల్సి ఉంటుంది.అందుకే మ‌ధుమేహం అంటేనే అంద‌రూ భ‌య‌ప‌డిపోతుంటారు.

అయితే ఇంత హానిక‌ర‌మైన ఈ మ‌ధుమేహాన్ని ముందుగానే గుర్తిస్తే.శాశ్వ‌తంగా చెక్ పెట్ట‌వ‌చ్చు.

మ‌రి మ‌ధుమేహాన్ని ముందుగా ఎలా గుర్తించాలి అన్న సందేహం మీకు రానే వ‌చ్చుంటుంది.అయితే ఇప్పుడు చెప్పుకోబోయే ల‌క్ష‌ణాలు మీలో క‌నిపిస్తే.

Advertisement

ఖ‌చ్చితంగా మీరు డ‌యాబెటిస్ టెస్ట్ చేయించుకోవాలి.మ‌రి ఆ ల‌క్ష‌ణాలు ఏంటీ అన్న‌ది లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.కంటి చూపు మంద‌గించ‌డం మ‌ధుమేహం ప్ర‌ధాన ల‌క్ష‌ణం.

అవును, ఒక‌వేళ మీకు ఉన్న‌ట్టు ఉంటి కంటి చూపు మంద‌గిస్తే.షుగ‌ర్ టెస్ట్ చేయించుకోవాలి.

షుగర్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు ఇలా జ‌రుగుతుంది.అలాగే పొడి గొంతు లేదా తరచుగా దాహం వెయ్యడం కూడా డ‌యాబెటిస్ ల‌క్ష‌ణంగా చెప్పుకోవ‌చ్చు.

నీర‌సం, త్వ‌ర‌గా అల‌సిపోవ‌డం, తరచుగా మూత్ర విసర్జన వంటి ల‌క్ష‌ణాలు క‌నిపించినా.డ‌యాబెటిస్ ఉన్న‌ట్టు భావించాలి.భావించ‌డ‌మే కాదు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

వెంట‌నే షుగ‌ర్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది.అలాగే డ‌యాబెటిస్ వ‌చ్చిందంటే.

Advertisement

ర‌క్త పోటు అధికంగా ఉంటుంది.అందుకే అధిక ర‌క్త పోటుతో బాధ ప‌డుతున్న వారు ఖ‌చ్చితంగా డ‌యాబెటిస్ టెస్ట్ చేయించుకోవాలి.

ఇక ఏదైనా గాయం అయిన‌ప్పుడు త్వరగా మానకపోవడం, ఒక్క‌సారిగా బ‌రువు త‌గ్గిపోవ‌డం, కాళ్లలో తిమ్మిర్లు వంటి ల‌క్ష‌ణాలు ఉన్నా.ఆల‌స్యం చేయ‌కుండా డ‌యాబెటిస్ టెస్ట్ చేయించుకోవాలి.

అలాగే మ‌ధుమేహం వ‌చ్చిందంటే.గుండె కొట్టుకోవ‌డంతో మార్పులు ఉంటాయి.

ముఖ్యంగా గుండె వేగంగా కొట్టుకుంటే.త‌ప్ప‌కుండా షుగ‌ర్ టెస్ట్ చేయించుకోవాలి.

పై ల‌క్ష‌ణాలు బ‌ట్టీ ముందుగానే మ‌ధుమేహాన్ని గుర్తించి త‌గిన జాగ్ర‌త్త‌లు పాటిస్తే.సులువుగా ఈ వ్యాధిని నివారించుకోవ‌చ్చు.

తాజా వార్తలు