బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఇవే..!

ముఖ్యంగా చెప్పాలంటే శరీరంలో అన్ని భాగాల్లో రక్త సరఫరా సంపూర్ణంగా జరుగుతూ ఉండాలి.అలా జరిగితేనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు.

శరీరంలో ఏ భాగానికైనా రక్త సరఫరా సక్రమంగా జరగకపోతే ఆ భాగం అచేతనంగా మారుతుంది.ఏ సందర్భంలోనైనా మెదడుకు ఆ స్థితి ఎదురైతే మరణం కూడా సంభవిస్తుంది.

దీనినే వైద్య పరిభాషలో బ్రెయిన్ స్ట్రోక్ ( Brain stroke )అని పిలుస్తారు.రక్తప్రసరణలో అసమతుల్యతకు రెండు కారణాలు ఉన్నాయి.

అందులో ఒకటి కొవ్వు చేరడం వల్ల రక్తనాళాల్లో పూడికలు ఏర్పడడం, రెండోది రక్తనాళాలు బలహీనపడి చిట్లడం అని కూడా చెప్పవచ్చు.

Advertisement

అలాగే శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు.సదరు శరీర భాగానికి రక్తం అందకపోవడం,గడ్డ కట్టడం వల్ల పక్షపాతం వస్తుంది.ఈ స్థితి నుంచి కోల్పోవడం అంతా సులభమైన విషయం కాదని వైద్యులు చెబుతున్నారు.

మెదడు,గుండెకు వచ్చే స్ట్రోక్‌లు ప్రాణాంతకాలని చెబుతున్నారు.కరోనా తర్వాత ప్రజలలో కొత్తగా అనేక ఆరోగ్య సమస్యలు ( Health problems )కనిపిస్తున్నాయి.

అందులో ప్రధానమైన సమస్య థ్రాంబోసిస్‌ అనే ఖచ్చితంగా చెప్పవచ్చు.రక్తనాళాలలో రక్తం గడ్డ కట్టడం చాలామందిలో వారికి తెలియకుండానే జరుగుతూ ఉంటుంది.

తద్వారా స్ట్రోక్ గురయ్యే వారి సంఖ్య ఈ మధ్యకాలంలో బాగా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.

మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ కావడంతో డబ్బులు వెనక్కు ఇచ్చేసిన హరీష్ శంకర్.. ఎన్ని రూ.కోట్లంటే?
ఇంతకీ ఆ గోడ కట్టింది ఎవరు ? టీడీపీ వర్సెస్ వైసిపి

పూర్వం రోజులలో ఒక నిర్దిష్ట వయస్సు తర్వాతే స్ట్రోక్ వచ్చేది.అప్పట్లో 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులోపు వారిలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపించేది.ప్రస్తుత సమాజంలో మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రస్తుతం చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవరికైనా ఈ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

ఇటీవల చిన్న వయసు వారిలో ఈ సమస్యను వైద్యులు గుర్తిస్తున్నారు.రోడ్డు ప్రమాదాలలో తలకు గాయమైన వారికి, భారీ శరీరం గలవారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి, వంశపారపర్యంగా పక్షవాతం వచ్చే వారిలో, మద్యపానం, ధూమపానం చేసే వారికి, రక్తం చిక్కబడడం, రక్తనాళాలు పటుత్వం కోల్పోవడం వల్ల స్ట్రోక్ ముప్పు వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఇలాంటి వారు అధిక రక్తపోటు( High blood pressure ),కొలెస్ట్రాల్ లేకుండా చూసుకోవాలి.మద్యం, పొగ తాగడం అస్సలు చేయకూడదు.

తాజా వార్తలు