జలుబు చేసినప్పుడు మీరు కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే!

జలుబు.( Cold ) ప్రస్తుత చలికాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా దాదాపు అందర్నీ సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఒకటి.

చిన్న సమస్య అయిన‌ప్ప‌టికీ జలుబు కారణంగా తీవ్ర ఇబ్బందికి లోనవుతుంటారు.ఈ క్రమంలోనే జలుబు తగ్గడం కోసం ఎన్నెన్నో మందులు వాడుతుంటారు.

అయితే మందులే కాదు కొన్ని కొన్ని ఆహారాలు కూడా జలుబు నుంచి త్వరగా మీకు విముక్తిని అందిస్తాయి.జలుబు చేసినప్పుడు కచ్చితంగా తీసుకోవాల్సిన ఆహారాలు కొన్ని ఉన్నాయి.

అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

చికెన్ సూప్.( Chicken soup ) రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.కూరగాయ ముక్కలు, మిరియాలు వేసి చికెన్ సూప్ ను తయారు చేసుకుని తీసుకుంటే జలుబు, దగ్గు వంటి సమస్యలు దెబ్బ‌కు ప‌రార్ అవుతాయి.

జలుబు చేసినప్పుడు కచ్చితంగా తీసుకోవాల్సిన మరొక సూపర్ ఫుడ్ పసుపు టీ.( Turmeric Tea ) పసుపులో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉంటాయి.

అందువల్ల పసుపుతో టీ తయారు చేసుకునే తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.జలుబు త్వరగా తగ్గుముఖం పడుతుందిఅలాగే జలుబు చేస్తే చాలా మంది పెరుగును దూరం పెడుతుంటారు.

పెరుగు తింటే జ‌లుబు ఇంకా ఎక్కువ అవుతుంద‌ని భావిస్తుంటారు.కానీ అది నిజం కాదు.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి.దాంతో సీజనల్ వ్యాధులు త్వ‌ర‌గా దూరం అవుతాయి.

Advertisement

అందుకే జ‌లుబు ఇబ్బంది పెడుతున్న‌ప్పుడు ప‌గ‌టిపూట ఒక క‌ప్పు పెరుగును త‌ప్ప‌క తీసుకోండి.

జలుబు చేసినప్పుడు రోజు ఉదయం రెండు పచ్చి వెల్లుల్లి రెబ్బల‌ను తేనెలో ముంచి తీసుకోవాలి.ఇలా చేస్తే సూపర్ ఫాస్ట్ గా జలుబు సమస్య నయం అవుతుంది.జలుబును తగ్గించడానికి సిట్రస్ పండ్లు కూడా హెల్ప్ చేస్తాయి.

నిమ్మ, నారింజ, ద్రాక్ష పండ్లను తీసుకోవాలి.ఇక జలుబు బారిన పడినప్పుడు ఆకుకూరలు, అల్లం, హెర్బల్ టీలు తీసుకుంటే త్వ‌ర‌గా రిక‌ర్ అవుతారు.

తాజా వార్తలు