ప్రస్తుతం చలి పులి చంపేస్తున్న సంగతి తెలిసిందే.రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
చలికి( Winter ) ప్రజలు గజగజా వణికిపోతున్నారు.
చలిని తట్టుకోలేక ఉదయం ఎనిమిది గంటలకు ముందు, సాయంత్రం ఆరు గంటల తర్వాత బయట కాలు పెట్టాలంటేనే భయపడుతున్నారు.
అయితే ఈ సీజన్ లో చలిని తట్టుకోవాలంటే శరీరాన్ని వెచ్చగా మార్చుకోవడం ఎంతో అవసరం.అందుకు ఇప్పుడు చెప్పబోయే బెస్ట్ అండ్ హెల్తీ ఫుడ్స్ అద్భుతంగా తోడ్పడతాయి.
మరి ఇంకెందుకు ఆలస్యం చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుందాం పదండి.నెయ్యి ( Ghee )రుచిగా ఉండడమే కాకుండా బోలెడన్ని పోషకాలను కడిగి ఉంటుంది.
ప్రస్తుత చలికాలంలో నెయ్యిని తప్పక తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.చలికాలంలో ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కలిపి ప్రతి రోజు తీసుకుంటే చలిని తట్టుకునే సామర్థ్యం లభిస్తుంది.
అదే సమయంలో రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.చర్మం తేమగా కూడా మారుతుంది.
అలాగే చలికాలంలో శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే బెస్ట్ ఫుడ్స్ లో సూప్స్ ఒకటి. వెజ్ అయినా నాన్ వెజ్ అయినా వేడి వేడిగా సూప్స్ తయారు చేసుకుని తీసుకుంటే శరీరం వెచ్చగాచ హైడ్రేటెడ్ గా మారుతుంది.అలాగే డ్రై ఫ్రూట్స్( Dry fruits ) కూడా బాడీలో హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి.
అంజీర్, ఎండు ద్రాక్ష, బాదం, పిస్తా వంటి డ్రై ఫ్రూట్స్ ను నిత్యం తీసుకోవాలి.
చలికాలంలో వెచ్చదనాన్ని ప్రోత్సహించే ఆహారాల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి.నిత్యం ఒక కప్పు దాల్చిన చెక్క టీ( Cinnamon Tea ) తీసుకుంటే చలిని సులభంగా ఎదుర్కోవచ్చు.దాల్చిన చెక్క టీ వల్ల వెయిట్ లాస్ సైతం అవుతారు.
ఇక చలికాలంలో వెచ్చదనాన్ని పొందాలంటే పసుపు, ఆవు పాలు, తేనె, పైనాపిల్, బొప్పాయి, మిరియాలు వంటి ఆహారాలను తరచూ తీసుకుంటూ ఉండాలి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy