టమాటా సాగులో అధిక దిగుబడినిచ్చే మేలు రకం విత్తనాలు ఇవే..!

టమాటా పంట( Tomato cultivation )ను సంవత్సరం పొడవునా ఏ కాలంలో అయినా సాగు చేయవచ్చు.

కాకపోతే అధిక ఉష్ణోగ్రత, అధిక వర్షపాతం మరియు వడగాలులు ఎక్కువగా ఉంటే టమాటా మొక్కల పెరుగుదల ఆశించిన స్థాయిలో ఉండదు.

కాబట్టి ఏడాదిలో ఏ కాలంలో సాగుచేసిన అధిక దిగుబడి సాధించాలంటే ముందుగా మేలు రకం విత్తనాలను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.ఉష్ణోగ్రతను తట్టుకొని పెరగగలిగే విత్తనాలే అధిక దిగుబడినిస్తాయి.

పూసా ఎర్లీడ్వార్ఫ్

: ఈ రకం వర్షాకాలం మరియు వేసవికాలంలో సాగుకు చాలా అనుకూలం.నాటిన 60 రోజుల్లో పంట కాపు కు వస్తుంది.

ఈ రకం పంట కాలము 120 నుంచి 130 రోజులు.ఒక ఎకరంలో దాదాపుగా 12 టన్నుల దిగుబడి పొందవచ్చు.

Advertisement

పూసా రూబీ

:( Pusa Ruby 0ఏడాది పొడవునా ఏ కాలంలో అయినా సాగు చేయవచ్చు.నాటిన 65 రోజుల లోపు పంట చేతికి వస్తుంది.ఈ రకం పంట కాలం 130 నుంచి 135 రోజులు.

ఒక ఎకరం పొలంలో 12 టన్నులకు పైగా దిగుబడి పొందవచ్చు.

పి.

కె.యం.1

: ఈ రకాన్ని ఏడాది పొడవునా ఏ కాలంలో అయినా సాగు చేయవచ్చు.నాటిన 60 రోజులలోపు పంట కోతకు వస్తుంది.

ఈ పంట కాల పరిమితి 130 నుంచి 135 రోజులు.ఒక ఎకరం పొలంలో దాదాపుగా పది నుంచి 12 టన్నుల వరకు దిగుబడి పొందవచ్చు.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
ఈ నెల 9 నుంచి అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం!

అర్క వికాస్

: ఈ రకం వేసవి కాలానికి అనుకూలంగా ఉంటుంది.వేసవిలో ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది కాబట్టి ఈ రకం సాగు చేయడం ఉత్తమం.

Advertisement

ఈ రకం పంట కాలపరిమితి 100 నుంచి 110 రోజులు.ఒక ఎకరం పొలంలో దాదాపుగా 16 టన్నుల వరకు దిగుబడి పొందవచ్చు.

అర్క సౌరభ్

:( Arka Saurabh ) ఈ రకం శీతాకాలం మరియు వేసవికాలంలో సాగుకు చాలా అనుకూలం.ఈ రకం పంట కాలపరిమితి 100 నుంచి 110 రోజులు.ఒక ఎకరం పొలంలో దాదాపుగా 14 టన్నుల దిగుబడి పొందవచ్చు.

పూసా సదా బహర్

:( Pusa Sada Bahar ) ఉష్ణోగ్రత ఎనిమిది డిగ్రీల నుండి 30 డిగ్రీల మధ్య ఉండే వాతావరణంలో ఈ రకం సాగు చాలా అనుకూలం.ఒక ఎకరం పొలంలో దాదాపుగా 10 నుంచి 14 టన్నుల వరకు దిగుబడి పొందవచ్చు .

తాజా వార్తలు