శివలింగానికి ఈ పదార్థాలతో రుద్రాభిషేకం చేస్తే కలిగే ప్రయోజనాలు ఇవే..!

శ్రావణమాసం శివున్ని( Lord shiva ) ఆరాధించడానికి అని పండితులు చెబుతున్నారు.పంచాక్షరి పారాయణానికి ఉపవాసం చేయడానికి ఈ మాసం ఎంతో పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు.

శ్రావణమాసం హిందూ ధర్మంలో పరమేశ్వరునికి ప్రీతికరమైన మాసంగా, అలాగే అత్యంత పవిత్ర మాసంగా భావిస్తారు.హిందూ ధర్మంలోనీ శివ పూజలో రుద్రాభిషేకం ఒక ముఖ్యమైన ఆచారంగా కొనసాగుతూ ఉంది.

రుద్రాభిషేకంలో భాగంగా శివలింగాన్ని వివిధ ప్రాంతాలలో భక్తితో అభిషేకం చేస్తారు.రుద్రాభిషేకం చేయడం వల్ల శివుని అనుగ్రహం త్వరగా లభిస్తుంది.

అయితే నియమానుసారంగా రుద్రాభిషేకం చేస్తేనే ఫలితం దక్కుతుంది.కాబట్టి రుద్రాభిషేకానికి కావలసిన సామాగ్రి ఏమిటో, దానికి సరైన మార్గం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement
These Are The Benefits Of Doing Rudrabhishekam With These Materials To Shivalin

శివునికి అత్యంత ఇష్టమైన వాటిలో నీరు ఒకటి.ఈ కారణంగా శివలింగంపై ఎప్పుడు నీరు పడుతుంది.

శ్రావణమాసంలో శివునికి నీటితో రుద్రాభిషేకం చేస్తే ఆర్థిక సమస్యలు( Financial problems ) తీరుతాయని ప్రజలు నమ్ముతారు.

These Are The Benefits Of Doing Rudrabhishekam With These Materials To Shivalin

చక్కగా పంటలు పండేందుకు, సమృద్ధిగా వర్షాలు కురవాలని శివుడిని పూజిస్తూ జలాభిషేకం కూడా చేస్తారు.అయితే శివలింగానికి స్వచ్ఛమైన చల్లని నీటిని సమర్పించాలని గుర్తుపెట్టుకోవాలి.ముఖ్యంగా చెప్పాలంటే శివలింగానికి నెయ్యితో రుద్రాభిషేకం చేయడం చాలా మంచిది.

శివలింగానికి నెయ్యితో రుద్రాభిషేకం చేస్తే ఆ కుటుంబానికి శాంతి చేకూరుతుంది.కుటుంబంలో ఆనందం, శాంతి, సౌభాగ్యం నెలకొంటుంది.

దర్శకుడిని ఓ రేంజిలో ఉతికారేసిన చంద్రమోహన్.. అసలు విషయం తెలిసి అవాక్కయ్యాడు..

మీరు జనన మరణ చక్రం నుంచి విముక్తి పొందాలంటే శ్రావణమాసంలో శివునికి తీర్థయాత్ర చేసి తెచ్చిన పవిత్ర జలంతో రుద్రాభిషేకం( Rudrabhishekam ) చేయాలి.

These Are The Benefits Of Doing Rudrabhishekam With These Materials To Shivalin
Advertisement

పవిత్ర పుణ్యక్షేత్రం నుంచి నీటిని తీసుకొని వచ్చి శివునికి అభిషేకం చేస్తే ఆ వ్యక్తి మరణం తర్వాత మోక్షాన్ని పొందుతాడని పండితులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే శివునికి తేనెతో రుద్రాభిషేకం చేస్తే శివుడు సమాజంలో మన గౌరవాన్ని పెంచుతాడు.ఉద్యోగ రంగంలో పురోభివృద్ధి, పదోన్నతి ఉన్నత స్థానం పొందుతారు.

విద్యాభివృద్ధి కూడా కలుగుతుంది.చేపట్టిన అన్ని కార్యక్రమాలలో విజయం పొందడానికి శివలింగానికి తేనెతో అభిషేకం చేయడం ఎంతో మంచిది.

అంతేకాకుండా శివునికి అత్యంత ఇష్టమైన వాటిలో చెరుకు రసం కూడా ఒకటి.మీరు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే శ్రావణమాసంలో శివలింగానికి చెరుకు రసంతో రుద్రాభిషేకం చేయాలి.

తాజా వార్తలు