ఈ సూపర్ హిట్ సినిమాల్లో మొదట అనుకున్న హీరోయిన్స్ ఎవరో తెలుసా..?

ఒక సినిమా మొదలవ్వాలంటే ఎన్నెన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాలి.ఒక కథ రాసుకునేటప్పుడే ఆ కథకు సంబంధించి మొత్తం యాక్టర్స్ ని అనుకుంటారు.

వన్స్ కథ ఓకే అయిపోయాక వాళ్ళని వెళ్లి కలుస్తారు.కానీ కొన్ని కారణాల వలన అనుకున్న హీరో, హీరోయిన్ డేట్స్ దొరకవు.

దాంతో వారి ప్లేస్ లో ఇంకొకరిని తీసుకుంటారు.ఇవన్నీ సినిమా ఇండస్ట్రీలో కామన్ గానే చూస్తారు.

అయితే ఇప్పుడు రాబోయే కొన్ని సినిమాలలో అలా ముందు ఎవర్ని అనుకోని తర్వాత ఎవర్ని తీసుకున్నారో ఆ లక్కీ సెలబ్రిటీస్ ఎవరో ఇప్పుడు ఓ లుక్కేద్దాం.

These Actors Are The First Choice For The Role But Later Heroine Changed, Colour
Advertisement
These Actors Are The First Choice For The Role But Later Heroine Changed, Colour

ఈ లిస్ట్ లో ముందుగా మనం కలర్ ఫోటో సినిమా గురించి మాట్లాడుకోవాలి.ఈ సినిమా ఆహాలో విడుదలై ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలిసిందే.ఇంకా ఈ సినిమాలో హీరో సుహాస్ అండ్ హీరోయిన్ చాందిని కూడా కథకు తగ్గట్టు కరెక్టుగా సరిపోయారు.

అయితే ఈ సినిమాలో ముందు హీరోయిన్ గా నిహారిక కొణిదెలని తీసుకుందామని అనుకున్నాడట డైరెక్టర్ సందీప్.ఈ విషయాన్నీ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.ఒకవేళ ఈ సినిమా గనుక నిహారిక చేసుంటే ఆమె లైఫ్ లో ఇదొక అందమైన సినిమాగా గుర్తుండి పోయేది.

బట్ చాందిని బాగా లక్కీ.

These Actors Are The First Choice For The Role But Later Heroine Changed, Colour

ఇక ఇటీవలే OTTలో రిలీజ్ అయి ఇండియా మొత్తంలో సూపర్ డూపర్ హిట్ అయిన "స్కామ్ 1992" సినిమా గురించి ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే.బేసిగ్గా ఈ సినిమా మొత్తం హర్షద్ మెహతా లైఫ్ స్టోరీ కాబట్టి ఆ సినిమాలో హర్షద్ గారిలా కనిపించిన హీరో ప్రతీక్ గాంధీ యాక్టింగ్ అరిపించాడనే చెప్పాలి.ఈ సినిమా హిందీలో ఉన్నా కూడా మన తెలుగు వాళ్ళు ఈ సినిమాకి, ప్రతీక్ యాక్టింగ్ కి ఫిదా అయిపోయారు.

చెవిటి వారు కాకూడ‌దంటే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

అయితే ఈ సినిమాలో హర్షద్ మెహతా క్యారెక్టర్ కి ముందు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ని అనుకున్నారట.కానీ ప్రతీక్ అదృష్టంవంతుడు.

Advertisement

ఇక హిందీలో సూపర్ హిట్ అయిన అందాధున్ సినిమాని ఇప్పుడు తెలుగులో నితిన్ రీమేక్ చేస్తున్నాడు.అయితే ఆ హిందీ అందాధున్ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్రలో హీరోయిన్ టబు నటించారు.అంత పవర్ ఫుల్ పాత్రని నితిన్ రీమేక్ లో ఎవరు చేయబోతున్నారంటూ కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఆ పాత్రని తెలుగులో కూడా టబు చేస్తేనే బావుంటుందని అనుకున్నారట కానీ ఆమె డేట్స్ దొరక్కపోవడంతో ఆ తర్వాత నయనతారని అనుకున్నారు.ఆమె డేట్స్ కూడా వర్కౌట్ అవ్వకపోవడం ఆ తర్వాత అనసూయ గారిని అడగడం.

వివిధ కారణాల వలన ఆమె కూడా తప్పుకోవడంతో ఆ పాత్రలో ఇప్పుడు తమన్నా నటించబోతుంది.

ఇక అల్లు అర్జున్ గారి పుష్పా సినిమాలో విలన్ గా తమిళ్ సూపర్ యాక్టర్ విజయసేతుపతి చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.అయితే సినిమా షూటింగ్ లేట్ అవ్వడం వలన విజయ్ సేతుపతిగారి డేట్స్ కుదరక ఆయన ఆ సినిమా నుండి తప్పుకున్నారు.బట్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో సేతుపతి గాని ఈ సినిమా చేసుంటే వీళ్లిద్దరి కొంబో అదిరిపోయేది.

బట్ మిస్ అయ్యాం.ఇక ఇప్పటివరకు పుష్పా సినిమా విలన్ ఎవరనేది సుకుమార్ ప్రకటించలేదు.

ధనుష్ నటించిన అసురన్ సినిమా తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి మనందరికి తెలిసిందే.ఆ సినిమాని ఇప్పుడు తెలుగులో నారప్ప అనే టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు.దీనిలో వెంకటేష్ గారు హీరోగా నటిస్తున్నారు.

అయితే తమిళ్ లో హీరో ధనుష్ భార్య క్యారెక్టర్లో నటించిన మంజు వారియర్ స్థానంలో ఇప్పుడు తెలుగులో వెంకటేష్ భార్యగ ముందు అనుష్కాని అనుకున్నారట.ఆతర్వాత హీరోయిన్ శ్రీయని కూడా సంప్రదించారట.

కానీ చివరికి ఆ అవకాశం ప్రియమణికి వరించింది.ఇటీవలే ఆమె పుట్టిన రోజునాడు నారప్పలోని ప్రియామణి స్టిల్ కూడా రిలీజ్ చేసారు.

ఆ లుక్ లో ప్రియమణి అదిరిపోయిందనే చెప్పాలి.

ఇక RRR సినిమాలో ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా ముందు ఇంగ్లీష్ హీరోయిన్ డైసీఎడ్గార్ జోన్స్ ని అనుకున్నారు.కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వలన ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుంది.ఆ తర్వాత ఎమ్మా రాబర్ట్స్ ని అనుకున్నారు.

కానీ ఈమెకూడా ఓకే కాలేదు.దాంతో చివరికి ఒలివియా మోరిస్ అనే ఇంగ్లీష్ పాప సెట్ అయింది.

తాజా వార్తలు