రైలు ప్రమాదం వెనుక కుట్రకోణం ఉండొచ్చు.. మమతా బెనర్జీ

ఒడిశా రైల్వేప్రమాద ఘటనా స్థలాన్ని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పరిశీలించారు.

ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ఆమె దీని వెనుక కుట్రకోణం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో రైలు ప్రమాదంపై కేంద్రం సమగ్ర దర్యాప్తు జరిపించాలని మమత తెలిపారు.మూడు సార్లు రైల్వేమంత్రిగా పని చేశానన్న ఆమె రాజకీయాలకు ఇది సమయం కాదని చెప్పారు.

బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వెల్లడించారు.బెంగాల్ తరపున బాధితులకు సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

ఇందులో భాగంగా 70 అంబులెన్స్ లు, వైద్య సిబ్బందిని ఒడిశా తీసుకొచ్చినట్లు తెలిపారు.

Advertisement
Lorem Ipsum Dolor Sit Amet