ఏపీలో కాస్ట్ లీ కార్పొరేట‌ర్లు అక్క‌డే... ఒక్కో కార్పొరేట‌ర్ ఖ‌ర్చు ఎన్ని కోట్లంటే...?

ఏపీలో కార్పొరేష‌న్ ఎన్నిక‌ల వేళ ఖ‌ర్చులు కోట్లలో ఉంటే నోట్ల క‌ట్ట‌లు తెగుతున్నాయి.కీల‌క‌మైన బెజ‌వాడ ఎన్నిక‌ల‌ను టీడీపీ, వైసీపీ రెండూ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాయి.

కొన్ని డివిజ‌న్ల‌లో ఒక్కో పార్టీ అభ్య‌ర్థికే కోటి ఇప్ప‌టికే ఖ‌ర్చు అవ్వ‌గా.ఎన్నిక‌లు పూర్త‌య్యే స‌రికి ఇది ఎంత‌కు వెళుతుందో ?  కూడా అర్థం కావ‌డం లేదు. బెజవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 64 డివిజన్లు ఉన్నాయి.

There Are Costly Corporators In AP Vijayawada How Many Crores Does Each Corporat

కీల‌క ప్రాంతాల్లో జ‌న‌ర‌ల్ డివిజ‌న్ల‌లో అయితే నోట్ల క‌ట్ట‌లు తెగుతున్నాయి.బీసెంట్ రోడ్ డివిజ‌న్ అభ్య‌ర్థి ఖ‌ర్చు రు.2 నుంచి 3 కోట్లు దాటుతుంద‌ని అంచ‌నా.ఇక తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలోని కృష్ణలంక అభ్యర్థి ఖర్చు రు.కోటి పై మాటే అంటున్నారు.ఇక వన్‌టౌన్‌లో జ‌న‌ర‌ల్ డివిజ‌న్ల‌లో అభ్య‌ర్థుల ఖ‌ర్చులు ఇప్ప‌టికే రు.కోటి దాట‌గా.రిజ‌ర్వ్ నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తోన్న వారే రు.అర‌కోటి దాటిన‌ట్టు చెపుతున్నారు. వన్‌టౌన్‌లో ప్రధాన వ్యాపార కూడళ్లకు కేంద్రమైన రెండుచోట్ల రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే ఖర్చు రు.కోటి దాటిన‌ట్టు చెపుతున్నారు.ప‌లు డివిజ‌న్ల‌లో అభ్య‌ర్థులు ఓటుకు రు.2 వేల వ‌ర‌కు పంచేందుకు రెడీ అవుతున్నారు.ఇక కొంద‌రు అయితే అధిక వ‌డ్డీల‌కు అప్పులు తెచ్చి మ‌రీ కార్పొరేట‌ర్లుగా పోటీ చేస్తున్నారు.

వాంబే కాలనీ, కండ్రిక ప్రాంతాల్లో సైతం అభ్యర్థులు ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీకి వేసుకున్న ఖర్చు కోటిగా తేలిందట.కృష్ణలంక రాణీగారితోటలోని రెండు డివిజన్లలో పోటీ రసవత్తరంగా మారింది.

Advertisement

ఇక్కడ ఇద్దరు అభ్యర్థుల ఖర్చు కోటి క్రాస్‌ చేసిందట.తూర్పు నియోజ‌క‌వర్గంలోని ప‌లు కీల‌క డివిజ‌న్ల‌లో అయితే రెండు పార్టీల అభ్య‌ర్థుల మ‌ధ్య హోరాహోరీ పోరు ఉండ‌డంతో విప‌రీతంగా ఖ‌ర్చు చేస్తున్నారు.

ఏదేమైనా ఏపీలో కాస్ట్ లీ కార్పొరేట‌ర్లు అంటే బెజ‌వాడ పేరే ముందుగా వినిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు