తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా, మా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు మంచు విష్ణు. చాలా కాలం తర్వాత మంచు విష్ణు నటించిన సినిమా జిన్నా అక్టోబర్ 21వ తేదీ దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది.దసరా కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ దీపావళి కానుకగా విడుదల కానుంది.ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ట్రైలర్ పోస్టర్స్ చూస్తుంటే ఈసారి మాత్రం విష్ణు పక్క హిట్ కొట్టేలాగే ఉన్నారని నెటిజన్స్ భావిస్తున్నారు.దీపావళి కానుక ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు థియేటర్ల సమస్య ఉందని చిత్ర బృందం వెల్లడించారు.
దీపావళి పండుగను పురస్కరించుకొని ఎన్నో చిన్న సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.ఒకవైపు కాంతర సినిమా అత్యధిక థియేటర్లలో ప్రదర్శితమవుతూ ఉండగా దీపావళి సందర్భంగా ప్రిన్స్, ఓరి దేవుడా,వంటి సినిమాలతో పాటు మరికొన్ని డబ్బింగ్ సినిమాలు కూడా విడుదల కానున్న నేపథ్యంలో జిన్నా సినిమాకు థియేటర్ల సమస్య ఉందని చిత్ర బృందం వెల్లడించారు.
ఈ క్రమంలోనే ఈ విషయం తెలియడంతో ఎంతో మంది నెటిజన్లు మా అధ్యక్షుడికే ఇలా థియేటర్ల సమస్య ఉంటే ఎలాగబ్బా అంటూ కామెంట్ లు చేస్తున్నారు.ఈ విధంగా ఒకే రోజే భారీ స్థాయిలో సినిమాలు విడుదల కావడం వల్ల థియేటర్ల సమస్య ఏర్పడటమే కాకుండా సినిమా వసూళ్లపై కూడా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతోందని చెప్పాలి.మరి దీపావళి సందర్భంగా ఒకేసారి ఇన్ని సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో మంచు విష్ణు ఎలాంటి హిట్ అందుకుంటారనే విషయంపై ఆసక్తి నెలకొంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy