బీచ్‌లో ఐఫోన్ పోగొట్టుకున్న మహిళ.. 7 గంటలు కంటిన్యూగా కష్టపడ్డ పోలీసులు... చివరికి??

సముద్రాలు, బీచులు, నదులు, కొండలు, గుట్టల వంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే చేతిలో నుంచి ఏదైనా విలువైన వస్తువు పడిపోతే మళ్ళీ దాన్ని తిరిగి పొందడం కష్టమవుతుంది.ఇటీవల కర్ణాటకకు ( Karnataka )చెందిన ఒక మహిళ కేరళలో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తుండగా సరిగ్గా ఇలాంటి ఒక సంఘటన ఆమెకు ఎదురయ్యింది.

బీచ్‌లో సమయం గడుపుతున్న సమయంలో ఆమె ఖరీదైన ఐఫోన్( iPhone ) (రూ.1,50,000) పెద్ద రాళ్ల మధ్య పడిపోయింది.ఈ ఘటనతో ఆమె చాలా బాధపడింది.

అయితే రిసార్ట్ సిబ్బంది, స్థానిక పోలీసులు, అగ్నిమాపక రక్షణ బృందం కలిసి చేసిన కృషి వల్ల ఆమె కథ సుఖాంతం అయ్యింది.

ఫోన్‌ను తిరిగి పొందడం సులభమైన పని కాదు.బృందం ప్రమాదకరమైన రాళ్ల మధ్య జాగ్రత్తగా నావిగేట్ చేయవలసి వచ్చింది.శక్తివంతమైన అలలను కూడా వారు ఫేస్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.

బలమైన గాలులు, వర్షం వంటి కఠినమైన వాతావరణ పరిస్థితుల ఉన్నప్పటికీ, బృందం పట్టుదలతో కృషి చేసింది.ఐఫోన్‌ను గుర్తించి తిరిగి పొందడానికి వారికి ఏడు గంటల నిరంతర ప్రయత్నం పట్టింది.

Advertisement

ఆంటిలియా చాలెట్స్ రిసార్ట్( Antilia Chalets Resort ) తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక వీడియోను షేర్ చేసింది, అందులో ఈ కష్టమైన రెస్క్యూ ఆపరేషన్‌ను చూపించారు.ఈ వీడియోలో, టీమ్ ఫోన్‌ను కనుగొనడానికి కలిసి పనిచేసే క్షణాలు కనిపించాయి.ఐఫోన్‌ను విజయవంతంగా తిరిగి పొందిన తర్వాత, మహిళ తన ఫోన్‌ను చూపిస్తూ హ్యాపీగా కెమెరాలకు ఫోజు ఇచ్చింది.

మహిళ ఐఫోన్ రికవరీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి 10 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ సాధించింది.కష్టతరమైన పరిస్థితుల్లో కూడా మహిళకు సహాయం చేసిన అధికారులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు.

Advertisement

తాజా వార్తలు