భర్తను కట్టేసి చితకబాదిన భార్య.. తాగాడనే !

మొదట్లో భర్త తాగొచ్చి భార్యను కొట్టేవాడు.కానీ రోజులు మారాయి.

భర్తలు తాగితే చాలు భార్యలు పూనకం వచ్చినట్లు కోపంతో ఊగిపోతున్నారు.

ఓ ఇల్లాలు ఏకంగా భర్త తాగొచ్చాడని భర్తను కింద పడుకోబెట్టి కాళ్లు చేతులు కట్టేసింది.

దుడ్డుగా ఉన్న కర్రతో భర్తపై విరుచుకుపడింది.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నెటిజన్ల కామెంట్ల మీద కామెంట్లు పెడుతూ వీడియోను షేర్ చేస్తున్నారు.భర్త చేతులు, కాళ్లను తాడుతో ఒక గుంజను కట్టేసి ఓ మహిళ చితకబాదింది.

Advertisement

దుడ్డు కర్రతో భర్తను గొడ్డును బాదినట్లు బాదింది.ఆ దెబ్బలకు ఆ భర్త పడుతున్న బాధ చెప్పలేని పరిస్థితి.

తాగొచ్చిన మైకాన్ని దింపి ఇంకెప్పుడు తాగనని ఆ భర్త నోట వచ్చేంత వరకు చితకబాదింది.ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందో తెలియదు కానీ ఈ వీడియో ఫోస్ట్ చేసిన నిమిషాల్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయి విహరిస్తోంది.

నెటిజన్లు తాగొచ్చిన భర్తను ఎలా చితకబాదుతుందో అని ప్రచారం జరుగుతున్నా అసలు విషయం తెలియదు.ఇంతలా కొడుతుందంటే తాగే వచ్చి ఉంటాడని కొంత మంది నెటిజన్లు తెలుపుతున్నారు.

మరి కొందరు ఈ మహిళను ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తుంది.ఇంకొందరు ఈ ఇల్లాలు ఎవరో కానీ దండేసి దండం పెట్టాలని కామెంట్లు పెడుతున్నారు.

వారంలో 3 సార్లు ఈ డ్రింక్ తాగితే.. మ‌ల్లెతీగ‌లా మార‌తారు!

అయితే ఈ వీడియోను చూసిన మహిళలు ఈమెను ఆదర్శంగా తీసుకుంటే తాగిన భర్తల పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని పలువురు నెటిజన్లు వాపోతున్నారు.

Advertisement

తాజా వార్తలు